బైరి నరేష్ పై దాడి సమర్థ నియమా?
TeluguStop.com
అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అనే నాస్తిక సమాజానికి చెందిన వ్యక్తిని కొంతకాలం క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే … అయితే ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన అతనిపై కొంతమంది సామూహికంగా దాడి చేసిన వీడియో మీడియాలో హల్చల్ చేస్తుంది… బయట నరేష్ చేసింది ముమ్మాటికి తప్పే దేవుళ్ళ గురించి అతను ఉపయోగించిన పదాలు, ఆ వ్యంగ్యం, కచ్చితంగా గర్హ్యనీయం.
బ్యాటింగ్ చేస్తే అయ్యప్ప పుట్టాడు లాంటి పదాలు కచ్చితంగా హిందూ భక్తులు మనో బావాలు దెబ్బ తీసేవే .
రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వతంత్రాన్ని ఇష్టమొచ్చినట్లుగా ఉపయోగించుకునే హక్కు ఎవరికీ ఉండదు ఎందుకంటే రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది.
"""/" /
మరో మనిషి తాలూకు మనో భావాలను దెబ్బతీస్తూ మన హక్కులను ప్రదర్శించుకుంటానంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు.
అయితే అతనిపై జరిగిన దాడి కూడా సరికాదు .ఎందుకంటే అతని ప్రవర్తన ని న్యాయస్థానంలో నిరూపించి శిక్ష పడేలా చూడలే తప్ప భౌతిక దాడులకు గురి చేయకూడదు అది బైరి నరేష్ అయినా ఎవరైనా సరే ఎందుకంటే మనకంటూఒక ఒక రాజ్యాంగం ఉంది ప్రాదేశిక చట్టాలు ఉన్నాయి """/" /
ఇంతకుముందు ఇదేవిధంగా వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసులు పెట్టి అతని చేత క్షమాపణ చేపించిన హిందూ ఆస్తిక సంఘాలు, బైరి నరేష్ విషయం లో మాత్రం భౌతిక దాడులకు దిగటం అనుచితంగా ఉంది,, ఇంతకుముందు ఇదే విధమైన వ్యాఖ్యలు చేసిన చాలామంది విషయంలో సంయమనం పాటించిన హిందూ సంఘాలు బైరి నరేష్ విషయంలో మాత్రం పదేపదే దాడులకు దిగటం కొంత అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే వచ్చేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఈ సంఘటనను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని కొంతమంది అనుమానిస్తున్నారు.
మటన్ తినడం లాభమా.. నష్టమా?