అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణ ఘటన జరిగింది.కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న సుమంగళి అనే మహిళపై ఆమె భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో గమనించిన విద్యార్థులు దాడిని అడ్డుకోవడంతో భర్త పరేశ్ పరార్ అయ్యాడని తెలుస్తోంది.

లెక్చరర్ సుమంగళికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే ఏడాది క్రితం ఆర్ట్స్ కాలేజీకి సుమంగళి బదిలీపై వచ్చారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సుమంగళి భర్త పరేశ్ తో దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..