శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకుని నరికి చంపిన తండ్రి

శ్రీకాకుళం జిల్లాలో దారుణం కొడుకుని నరికి చంపిన తండ్రి

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది.కని పెంచిన కొడుకుని పాశవికంగా నరికి చంపాడు ఓ కసాయి తండ్రి.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం కొడుకుని నరికి చంపిన తండ్రి

ఈ అమానుష ఘటన ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో చోటు చేసుకుంది.అర్ధరాత్రి సమయంలో కొడుకు తాతారావుపై తండ్రి కొండ్రు కుప్పేసు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం కొడుకుని నరికి చంపిన తండ్రి

నిద్రపోతున్న కుమారుడిని నరికి చంపాడు.దీంతో తీవ్రగాయాలపాలైన తాతారావు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.

అనంతరం మిగతా కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసేందుకు కుప్పేసు ప్రయత్నించాడని తెలుస్తోంది.

కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అదేవిధంగా హత్యపై కేసు నమోదు చేసి నిందితుడు కుప్పేసు కోసం గాలిస్తున్నారు.అయితే హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మిరపకాయల్ని ఇలా కూడా దంచుతారా? ఈ అమ్మాయిల టాలెంట్ చూస్తే పడి పడి నవ్వుతారు!

మిరపకాయల్ని ఇలా కూడా దంచుతారా? ఈ అమ్మాయిల టాలెంట్ చూస్తే పడి పడి నవ్వుతారు!