ప్రకాశం జిల్లాలో దారుణం.. 11 ఏళ్ల బాలికకు వాతలు పెట్టిన మహిళ

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.తన ఐదేళ్ల కూతురికి ముద్దు పెట్టిందని 11 ఏళ్ల బాలికకు వాతలు పెట్టింది ఓ మహిళ.

ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటు చేసుకుంది.తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఆడుకోవడానికి వచ్చిన బాలిక ఇంటికి సమీపంలో ఉన్న ఐదేళ్ల చిన్నారిని ముద్దాడింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఐదేళ్ల పాప తల్లి బాలికను కట్టేసి వాతలు పెట్టింది.

బాధిత బాలిక కేకలు వేయడంతో వచ్చిన స్థానికులు విడిపించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?