ముంబై లో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా కోసి కుక్కర్ లో ఉడికించిన ప్రియుడు..!

ప్రస్తుత సమాజంలో ఎదుటి వ్యక్తి ఆకర్షణకు లోనై అక్రమ సంబంధం పెట్టుకునే వారు క్రమంగా పెరుగుతూనే ఉన్నారు.

అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వయస్సుతో సంబంధం లేకుండా పోయింది.వివాహం అయినా, వయసులో పెద్ద వ్యత్యాసం ఉన్న, బంధుత్వం ఉన్న కూడా అవన్నీ పక్కన పెట్టేసి సహజీవనం ప్రారంభిస్తున్నారు కొందరు వ్యక్తులు.

అయితే మనిషి గ్రహించలేకపోతున్న విషయం ఏమిటంటే సహజీవనం చివరకు దారుణమైన హత్యలకు దారితీస్తుంది.

ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్న సంగతి తెలిసిందే.అయితే విచారణలో మాత్రం అక్రమ సంబంధాలతోనే చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు బయటకు వస్తున్నాయి.

"""/" / తాజాగా ముంబై( Mumbai ) నగరంలో జరిగిన దారుణమైన ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం.వివరాల్లోకెళితే.

ముంబై నగరంలోని గీతా నగర్ లో నివసిస్తున్న మనోజ్ సహాని( Manoj Sahani ) (53) అనే వ్యక్తితో అదే ప్రాంతంలో ఉంటున్న సరస్వతి( Saraswati ) (36) అనే మహిళతో మూడు సంవత్సరాల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది.

అప్పటినుంచి ఇద్దరు సహజీవనం చేస్తూ సంతోషంగానే ఉన్నారు.గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల గొడవలు ప్రారంభమయ్యాయి.

"""/" / రోజురోజుకు గొడవలు పెరుగుతూ ఉండడంతో మనోజ్ సహని విసిగిపోయి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

సరస్వతిని హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు.తర్వాత శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడికించాడు.

అయితే బుధవారం పక్కింటి వాళ్లకు దుర్వాసన వస్తూ ఉండడంతో మనోజ్ ఇంటిపై నిఘా పెట్టారు.

ఇక మనోజ్ మృతుదేహ శరీర భాగాలను ఉడికించడం కల్లారా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వెంటనే గీతానగర్ పరిధిలో ఉండే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సరస్వతి నాలుగు రోజుల క్రితం హత్యకు గురైనట్లు నిర్ధారించారు.

మృతుదేహ శరీర భాగాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఇక మనోజ్ సహానిపై హత్య కేసు నమోదు చేసి ఇతనితో పాటు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలు ఏమిటో విచారిస్తున్నారు.

ప్లానింగ్ లో ప్రభాస్ ను మించిన హీరో లేడుగా.. ఈ హీరోకు ఎవరూ సాటిరారుగా!