కృష్ణాజిల్లాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం..!

ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి.

ముందు మంచి వారిలాగా పరిచయం చేసుకుని, కొంతకాలం తర్వాత సమయం చూసి దారుణాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించిన సమాజంలో ఉండే కామాంధులలో కాస్త కూడా మార్పు అనేదే రావడం లేదు.

ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఓ మహిళ కామాంధుని కామానికి బలి అవుతూనే ఉంది.

ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో ( Krishna District )చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

కృష్ణాజిల్లా లోని మచిలీపట్నం( Machilipatnam ) కు చెందిన ఓ అమ్మాయి పై, అదే ప్రాంతానికి చెందిన సతీష్( Satish ) అనే యువకుడు కన్నేశాడు.

ఆ అమ్మాయిని మంచి వాడిలాగా పరిచయం చేసుకున్నాడు.కొంతకాలం తర్వాత ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించాలి అనుకున్నాడు.

ఈ విషయం తన స్నేహితులైన మణికంఠ, కళ్యాణ్( Manikantha, Kalyan ) లకు చెబితే వారు కూడా సహకారం అందించారు.

"""/" / ఇక పథకం ప్రకారం ఆ అమ్మాయికి ఫోన్ చేసి కలవాలని కోరాడు.

ఆ అమ్మాయి సతీష్ చెప్పిన ప్రాంతానికి వెళ్ళింది.సతీష్ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి తో తాగించాడు.

కాసేపటికి ఆ అమ్మాయి మత్తు లోకి జారుకున్నాక, తన స్నేహితులైన మణికంఠ, కళ్యాణ్ ఇలా సహాయంతో లాడ్జికి తీసుకువెళ్లాడు.

తర్వాత ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆ అమ్మాయి మద్యం మత్తులో ఉండడం వలన తనపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రతిఘటించలేకపోయింది.

"""/" / కాసేపటికి మత్తులో నుంచి చేరుకున్నాక సతీష్ తనపై చేసిన దారుణాన్ని తలుచుకొని చాలా కుమిలిపోయింది.

ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సతీష్ ను అదుపులోకి తీసుకొని 376 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సతీష్ కు సహకరించిన స్నేహితులు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ విషయం బయటకు రావడంతో సతీష్ తో పాటు అతని స్నేహితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఈమె కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!