గోవాలో దారుణం.. మహిళను లాకెళ్లి చంపేసిన మొసలి..
TeluguStop.com
ఉత్తర గోవాలోని అమ్థానే డ్యామ్( Amthane Dam ) వద్ద దారుణం చోటు చేసుకుంది.
ఒక మొసలి దాడిలో 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఈ సంఘటన శనివారం జరిగింది.
ఈ ఘటనను చూసి చాలామంది షాక్ అయ్యారు.ఆపై మధ్యాహ్నం 2:20 గంటలకు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితురాలి మృతదేహాన్ని సంగీతా బేబుల్ శింగడిగా( Babel ) గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.సంగీత తన మేకలను మేపేందుకు ఆనకట్ట వద్దకు వెళ్లినట్లు సమాచారం.
తర్వాత ఆమెకు ఎలాంటి ఆలోచన వచ్చిందో ఏమో కానీ అనవసరంగా నీటిలోకి ప్రవేశించింది.
ఆ నీళ్లలోనే ఉన్న ఒక మొసలి మహిళను( Crocodile Woman ) గమనించింది.
ఆపై దాడి చేసి ఆమెను నీటి అడుగున లాగింది.అనంతరం ఆమెను విచక్షణారహితంగా కోరికేసింది.
దాంతో తీవ్ర గాయాలైన మహిళ జల సమాధి అయింది. """/" /
అగ్నిమాపక కేంద్రం( Fire Station ) అధికారులు మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు, తరువాత వారు మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం పరీక్షకు పంపారు.
ఈ డ్యామ్ అనేక మొసళ్లకు నిలయమని ఆ ప్రాంత స్థానికులు పేర్కొన్నారు.ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు నీటిలోకి వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు.
ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోకుండా నిరోధించడానికి డ్యామ్‌కు రక్షణగా రెయిలింగ్‌ను ఏర్పాటు చేయాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
"""/" /
ఈ సంగతి తెలిసిన మరికొందరు క్రూరమైన మొసళ్లు ఉన్న ప్రాంతాన్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ గా ఎలా వదిలేసారు అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు.
ఇకపై ఎవరి ప్రాణాలు పోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!