ఆత్మకూర్ (ఎం) ఎమ్మార్వో ఆఫిస్ లో అధికారుల నిర్లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మకూర్ (ఎం) మండలం కేంద్రంలోని తహసిల్దార్ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన జనరేటర్ సుమారుగా ఏడేళ్లకు పైగా మరమ్మతులకు నోచుకోక అలంకారప్రాయంగా మారింది.

ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలకు అందించే సేవలు నిలిచిపోకూడదనే ఉద్దేశ్యంతో జనరేటర్ అందుబాటులోకి తెచ్చింది.

కానీ,ఈ జనరేటర్ ఏడేళ్లుగా పని చేయకుండా మూలకు పడింది.కార్యాలయ అధికారులు దానిని మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

వేసవిలో కరెంటు సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి జనరేటర్ కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

అమెరికా: భారతీయుల జీవితాలు అల్లకల్లోలం.. వీసాల గందరగోళంతో ఆందోళన.. అసలేం జరుగుతోంది?