మన దర్శకుడు.. బాలీవుడ్ సూపర్ స్టార్‌ షురూ చేశారు

ఈమద్య కాలంలో సౌత్‌ స్టార్స్‌ పలువురు బాలీవుడ్‌ బాట పడుతున్నారు.చాలా మంది తెలుగు తమిళ ఇతర సౌత్‌ భాషల హీరోలు హీరోయిన్స్ మరియు ఫిల్మ్‌ మేకర్స్ హిందీలో సినిమాలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు.

భాషతో సంబంధం అనేది లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నారు.హిందీలో మన స్టార్స్ చాలా మంది చాలా సినిమాలు చేస్తున్నారు.

తెలుగు మరియు తమిళ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అయిన కొందరు హిందీలో సినిమా లు చేసేందుకు క్యూ కడుతున్నారు.

తాజాగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ బాలీవుడ్ లో భారీ సినిమాను చేసేందుకు గాను సిద్దం అయ్యాడు.

గత రెండు మూడు సంవత్సరాలుగా అట్లీ మరియు షారుఖ్ ఖాన్ ల కాంబో సినిమా గురించి వార్తలు వస్తున్నాయి.

ఎట్టకేలకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

విజయ్ తో అట్లీ తెరకెక్కించిన సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో అంతా ఉన్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"""/"/ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పాన్ ఇండియా సినిమా లు అంటూ వస్తున్నాయి.

ప్రస్తుతం షారుఖ్ మరియు అట్లీ ల కాంబోలో రూపొందుతున్న సినిమా ను కూడా పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారట.

అంటే హిందీ తో పాటు తెలుగు తమిళం ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.

తారా స్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ గొడవలు… లక్ష్మి ప్రసన్న పోస్ట్ వైరల్!