కనీసం వారినైనా వదిలేయండి… ఆవేదన వ్యక్తం చేసిన కుష్బూ!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారో అదే స్థాయిలో విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు.

ఈ క్రమంలోనే తరచూ సెలబ్రిటీల గురించి వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేటిజన్స్ ట్రోల్ చేయడం మనం చూస్తుంటాము.

ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు.

"""/"/ ఈ క్రమంలోనే సీనియర్ నటిగా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈమె దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.ఇక కుష్బూ కుమార్తెలు ఇంకా వెండి తెరపై సందడి చేయలేదు కానీ వీరి గురించి మాత్రం తరచు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి.

"""/"/ కుష్బూ ఇద్దరు కుమార్తెలు అవంతిక, అనందితల రూపం విషయంలో కొంతమంది నెటిజన్లు తరచూ ట్రోల్ చేస్తూ ఉంటారు.

అయితే గతంలో ఇలా వీరి గురించి ట్రోల్ చేసిన వారి పట్ల కుష్బూ ఘాటుగా స్పందిస్తూ వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

అయితే తాజాగా ఫిబ్రవరి 13వ తేదీ కుష్బూ తన ఇద్దరి కుమార్తెల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఓ నెటిజన్ యధావిధిగా వీరి పై నెగిటివ్ కామెంట్స్ చేశారు.ఆ ఇద్దరు ముక్కు సర్జరీ చేయించుకున్నారని అన్నాడు.

 దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుష్బూ 20,22 సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లలకు కత్తులతో కోసి సర్జరీలు చేయించాల్సిన అవసరం లేదు.

కనీసం చిన్నపిల్లల నైనా వదిలేయండి అంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాటిల్ గ్రౌండ్‌లోకి ఇండో అమెరికన్లు.. కమలా హారిస్ కోసం భారీ క్యాంపెయినింగ్