Athulya Ravi : పెళ్లికి ముందే సహజీవనం.. అదే ఇప్పుడు ట్రెండ్.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ అతుల్య రవి( Heroine Athulya Ravi ).ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా మీటర్.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

కాగా అతుల్య రవి తమిళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అన్న విషయం తెలిసిందే.

తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో అతుల్య రవి కూడా ఒకరు.

2017లో కాదల్ కన్ కట్టుడే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. """/" / ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఒకవైపు కోలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు టాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికు వర్జినిటీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆ ప్రశ్నలకు ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా సమాధానం చెప్పింది.ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ.

వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు ?అని అడగగా.నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయసు కరెక్ట్ అని తెలిపింది.

""img / తర్వాత అలాగే పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా ? లేక పెళ్లి తర్వాత మంచిదా ? అని ప్రశ్నించగా.

అతుల్య సూటిగానే స్పందిస్తు.నా అభిప్రాయం ప్రకారం పెళ్లి తర్వాతే లైంగికరమైన రిలేషన్ షిప్( Relationship ) ఉత్తమం.

అది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది అని ఆమె చెప్పుకొచ్చింది.

లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి.

ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.పెళ్లికి ముందే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం సహజీవనం చేయడం అన్నది ట్రెండ్ అయిపోయింది అన్న ఉద్దేశంతో చెప్పుకొచ్చింది అతుల్య.

ఒకరితో రిలేషన్ లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం.దీనిపై ఎవరికీ అధికారం లేదు.

అయిత వివాహమే( Marriage ) అన్నిటికంటే బెస్ట్ రిలేషన్ అని చెప్పుకొచ్చింది అతుల్య.

ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!