Atharva Movie Review : అథర్వ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్?
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కేవలం ప్రేమ కథ సినిమాలో మాత్రమే కాకుండా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి జానర్ లో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇలాంటి క్రైమ్ సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం అథర్వ( Atharva )కార్తీక్ రాజు సిమ్రన్ చౌదరి ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి( Mahesh Reddy ) తెరకెక్కించాడు.
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది అయితే ఇప్పటికే ప్రీమియర్స్ వేగా ఈ ప్రీమియర్ టాక్ బయటకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే.
"""/" /
H3 Class=subheader-styleకథ:/h3p దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు)( Karthik Raju ) పోలీస్ అవ్వాలనీ ఎన్నో కలలు కంటూ ఉంటారు.
అయితే ఈయన పోలీస్ అయి పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే కలలు కంటూ పోలీస్ సెలక్షన్ కి వెళ్తారు కానీ కార్తీక్ ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉండటం వల్ల తనని రిజెక్ట్ చేస్తారు.
ఇలా పోలీసు సెలక్షన్లో ఈయన రిజెక్ట్ కావడంతో పట్టుబట్టి ఎలాగైనా క్లూ టీం లో జాబ్ సంపాదిస్తారు.
కార్తీక్ తన అతి తెలివితేటలను ఉపయోగించి నేరస్తులను ఎంతో తొందరగా కనిపెడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే తన స్నేహితురాలు అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ తన జీవితంలోకి వస్తుంది.
ఆమె మీదున్న ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు కర్ణ.నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) పెద్ద హీరోయిన్.
జోష్ని ఇంట్లోనే జోష్ని తన ప్రియుడు శివ (శివ)( Shiva ) శవాలై పడి ఉంటారు.
అయితే వీరిద్దరూ చనిపోవడానికి కారణం తన ప్రియుడు ఆమెను అనుమానించడంతో తనని చంపి తాను చనిపోయాడని పోలీసులు కొట్టివేస్తారు.
ఇక కార్తీక్ కూడా అలాగే అంటారు కానీ నిత్యం మాత్రం మీరు చావు వెనక ఏదో ఉందని ఖచ్చితంగా వేరేది మర్డర్ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంది.
మరి ఈ కేసును కార్తీక్ ఎలా చేదించారు అసలు జోష్ని, శివ ఎందుకు చనిపోయారు అన్నది సస్పెన్స్ గా మారింది.
మరి ఈ సినిమాలో వారిద్దరి ఎలా చనిపోయారో ఆ కేసును కార్తీక్ ఎలా చేదించి నిందితులను పట్టుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
"""/" /
H3 Class=subheader-styleనటీనటుల నటన:/h3pకార్తీక్ రాజు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.ఫ్రెండ్స్‌తో ఉన్న టైంలో కామెడీ, కేసును చేదించే టైంలో సీరియస్ నెస్, ప్రేయసితో ఉన్నప్పుడు లవ్ యాంగిల్ ఇలా ఎప్పుడు ఏ యాంగిల్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో చాలా అద్భుతంగా అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి జోష్ని కూడా చాలా అద్భుతంగా నటించారు.మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు అనుగుణంగా పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి.
"""/" /
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p సినిమా మొత్తం సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసేలా అద్భుతమైన కథను డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఇక కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.ఎడిటింగ్ వరకు కూడా చాలా సూపర్ గా అనిపించింది.
మ్యూజిక్ పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి.నిర్మాణాత్మక విలువలు కూడా చాలా బాగున్నాయి.
H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p ఇప్పటివరకు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలు చాలా వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఇప్పటివరకు ఇలాంటి కేసులు అన్నింటిని పోలీసులు దర్యాప్తు చేయడం చూసాము కానీ ఓ పోలీస్ కాకుండా.
ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడమే కొత్తగా ఉంటుంది.
ఇక సినిమా మొదట్లో కాస్త స్లోగా సాగుతుంది తర్వాత సినిమా చాలా ఆసక్తికరంగా ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకులకు సైతం ఆసక్తిని కలిగిస్తుంది ఇక క్లైమాక్స్ అద్భుతంగా ఉంది.
మొత్తానికి సరికొత్త క్రైమ్ త్రిల్లర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p సినిమాలోని ట్విస్టులు, హీరో నటన, మ్యూజిక్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ కథ చాలా స్లోగా సాగటం,
H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చిన ఈ సినిమా మాత్రం సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు కలిగిస్తుంది.
సరికొత్త ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.h3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.