పాలన చేతకాకపోతే దిగిపోవాలి జగన్ పై అచ్చెన్నాయుడు సీరియస్..!!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో విపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

దీనిలో భాగంగా ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.సీఎం జగన్ పై మండిపడ్డారు.

జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని.స్విచ్ వేయకుండానే ప్రజలకు షాకిచ్చే రీతిలో ప్రభుత్వ పనితీరు ఉందని మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు రూ 11,600.

కోట్ల భారం పడనుంది అని ఆరోపించారు.తాజా పెంపు చార్జీలతో ఏడాదికి మరో నాలుగు వేల కోట్లకు పైగానే భారం పడనుందని అచ్చెన్నాయుడు తెలియజేశారు.

చేతగాని పాలనతో ఒకవైపు విద్యుత్ వ్యవస్థను మరోవైపు ప్రజలపై భారం మోపుతున్నారని.మండిపడ్డారు.

పరిపాలించడం రాకపోతే అధికారం నుండి దిగిపోవాలని.అంతేగాని పన్నులు మరియు చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపకూడదని సీరియస్ కామెంట్ చేశారు.

అంతమాత్రమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అనేక సందర్భాలలో విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.

ప్రజల పై అనేక పన్నుల రూపంలో.భారం మోపుతున్నారని ఇది దారుణమని అన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచిన సందర్భాలు లేవని.

అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!