గ‌ర్భిణీలు ఆ టైమ్‌లో బాదం తింటే..మ‌స్తు బెనిఫిట్స్ పొందొచ్చ‌ట‌!

న‌ట్స్‌లో బాదం ప‌ప్పుది ప్ర‌త్యేక స్థానం.బాదం ప‌ప్పు రుచిగా ఉండ‌ట‌మే కాదు.

పొటాషియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, జింక్, సిలీనియం, ఫైబర్, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే బాదం ప‌ప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు రెగ్యుల‌ర్‌గా బాదం ప‌ప్పు తీసుకుంటే.

పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్యంగా, తెలివిగా పుడ‌తారు.అయితే ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎలా ప‌డితే అలా కాకుండా బాదం ప‌ప్పు ఎప్పుడు తీసుకోవాలి ? ఎన్ని తీసుకోవాలి.

? ఎలా తీసుకోవాల‌ని ? అన్న విష‌యాలు గ‌ర్భ‌ణీలు తెలుసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బాదం ప‌ప్పును నీటితో రాత్రంతా నాన‌బెట్టుకుని.ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి.

ఇలా తింటే.అధిక ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం దూర‌మై జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. """/" / అలాగే చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ర‌క్త‌హీన‌త ద‌రి చేర‌కుండా ఉంటుంది.ఇక క‌డుపులోని బిడ్డ యొక్క మొదడుకు, నాడీవ్యవస్థకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.

అయితే ప‌ర‌గ‌డుపు బాదం ప‌ప్పులు తీసుకుంటే.శ‌రీరానికి ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది.

మ‌రి ఇంతకీ ఎన్ని బాదం ప‌ప్పులు తినాల అన్న సందేహం మీరు వ‌చ్చే ఉంటుంది ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో రోజుకు నాలుగు నుంచి ఆరు వ‌ర‌కు తీసుకోవ‌చ్చు.

అంత‌కంటే ఎక్కువ తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.అలాగే మ‌రో విష‌యం ఏంటంటే.

పొట్టు తీయ‌ని బాదం ప‌ప్పును గ‌ర్భిణీలు అస్స‌లు తిన‌రాదు.మ‌రియు కొంద‌రికి బాదం ప‌ప్పును డైరెక్ట్‌గా తీసుకుంటే.

అలర్జీకి గుర‌వుతుంటారు.అలాంటి గ‌ర్భిణీలు మిల్క్ షేక్స్‌లోనూ, స‌లాడ్స్‌లోనూ లేదా ఇత‌రిత‌ర ఆహారాల్లోనూ బాదంను జోడించి తీసుకుంటే మంచిది.

నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్