చెల్లి కోసం అప్పట్లో వెంకటేష్ నాగార్జున తో కొట్లాటకు దిగాడా..!
TeluguStop.com
సీనియర్ హీరోస్ లో ఎంతో కూల్ గా ఫ్రెండ్లీ వాతావరణం ని ఇష్టపడే హీరోలలో విక్టరీ వెంకటేష్( Daggubati Venkatesh ) ముందు ఉంటాడు.
ప్రతీ హీరో తో ఆయన ఎంతో క్లోజ్ గా మెలిగే విధానం ప్రేక్షకులకు ఎంతో నచుతుంది.
అందుకే ఏ హీరో అభిమానికి అయినా, సెకండ్ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే విక్టరీ వెంకటేష్ పేరే చెప్తారు.
ఆయన చేసిన సినిమాలు, పోషించిన పాత్రలతో పాటు బయట ఆయన మెలిగే విధానం అలాంటిదిమరి.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈయనకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియా లో ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అందుకే ఆయన సినిమాలకు పర్వాలేదు చూడొచ్చు అనే రేంజ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది.
నేటి తరం స్టార్ హీరోలకు ఆ వసూళ్లు ఏమాత్రం తీసిపోవు. """/" /
అయితే విక్టరీ వెంకటేష్ గారి గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడింది.
ఎంతో కూల్ యాటిట్యూడ్ తో ఉండే వెంకటేష్, అక్కినేని నాగార్జున తో ఆయన చెల్లి విషయం లో ఒక రేంజ్ లో గొడవపడ్డాడు అనే విషయం చాలా మందికి తెలియదు.
విషయం లోకి వెళ్తే వెంకటేష్ చెల్లెలు లక్ష్మి దగ్గుపాటి( Lakshmi Daggubati ) ని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
వీరిది లవ్ మ్యారేజ్ కాదు, పెద్దలు కుదిరించిన మ్యారేజ్.అక్కినేని నాగేశ్వర రావు మరియు రామానాయుడు మధ్య ఎంతో కాలం నుండి ఉన్న సాన్నిహిత్యం కారణం గా నాగార్జున కి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసాడు.
కొంతకాలం దాంపత్య జీవితం బాగానే కొనసాగింది కానీ , ఆ తర్వాతే విభేదాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది.
వీళ్లిద్దరికీ పుట్టిన బిడ్డే నాగ చైతన్య. """/" /
అయితే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వెంకటేష్ నాగార్జున మరియు లక్ష్మి ని కలపాలని చాలా వరకు ప్రయత్నం చేసాడట.
లక్ష్మి కి కలవాలని ఉన్నా, నాగార్జున కి మాత్రం లేదు.ఎందుకంటే అప్పటికే ఆయన ప్రముఖ హీరోయిన్ అమలతో ప్రేమలో ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ కి కోపం కట్టలు తెంచుకుంది.నాగార్జున తో ఒక రేంజ్ లో గొడవ పడేందుకు వెళ్ళాడు.
గొడవపడ్డాడు కూడా, చాలా సంవత్సరాల వరకు వీళ్లిద్దరి మధ్య మాటలు లేవు.వెంకటేష్ ఎదురైతే తల దించుకొని వెళ్లిపోయేవాడు నాగార్జున.
( Nagarjuna ) అలా చాలా రోజులు జరిగింది , ఆ తర్వాత రీసెంట్ సమయం లో వీళ్లిద్దరు మళ్ళీ స్నేహం గా ఉండడం మొదలు పెట్టారు.
వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!