ఆ స్టేజ్‌లో స్త్రీలు క్యారెట్‌ను త‌ప్ప‌కుండా తినాల‌ట‌.. తెలుసా?

ఆ స్టేజ్‌లో స్త్రీలు క్యారెట్‌ను త‌ప్ప‌కుండా తినాల‌ట‌ తెలుసా?

క్యారెట్‌.చూసేందుకు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే అద్భుత‌మైన దుంపుల్లో ఇది ఒక‌టి.

ఆ స్టేజ్‌లో స్త్రీలు క్యారెట్‌ను త‌ప్ప‌కుండా తినాల‌ట‌ తెలుసా?

రుచిప‌రంగా తియ్య‌గా ఉండే క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ బి6, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

ఆ స్టేజ్‌లో స్త్రీలు క్యారెట్‌ను త‌ప్ప‌కుండా తినాల‌ట‌ తెలుసా?

అందుకే ఆరోగ్యానికి, చ‌ర్మ సౌంద‌ర్యానికి క్యారెట్లు ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ స్టేజ్‌లో రోజుకు ఒక క్యారెట్ ను త‌ప్ప‌కుండా తినాల‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అస‌లింత‌కీ మెనోపాజ్ ద‌శ‌లో క్యారెట్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఏయే ఉప‌యోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే ద‌శ‌నే మెనోపాజ్ అంటారు.

ఆ స‌మ‌యంలో ఒత్తిడి, స్థూలకాయం, జుట్లు రాలడం వంటి స‌మ‌స్యలు ఎదుర‌వుతుంటాయి.అయితే వాటిని అదుపు చేయ‌డంలో క్యారెట్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

రోజుకు ఒక క్యారెట్ చ‌ప్పున రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.అందులో ఉండే పోష‌కాలు హెయిర్ ఫాల్ కి చెక్ పెడ‌తాయి.

శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతాయి.ఒత్తిడి ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

"""/"/ అలాగే మెనోపాజ్ ద‌శ‌లో చాలా మంది స్త్రీలు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతుంటారు.

అయితే క్యారెట్‌ను డైట్‌లో చేర్చుకుంటే.అందులో స‌మృద్ధిగా ఉండే ఐర‌న్ కంటెంట్ ర‌క్త‌హీనత స‌మ‌స్య‌ను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తుంది.

మెనోపాజ్ ద‌శ‌లో స్త్రీలు గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌రమైన జ‌బ్బుల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

అయితే క్యారెట్ ను తీసుకుంటే.ఆయా జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

అంతేకాదు, మెనోపాజ్ ద‌శ‌లో క్యారెట్ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌.చికాకు, విసుగు, కోపం వంటి కంట్రోల్‌లో ఉంటాయి.

చ‌ర్మం యొక్క నిగారింపు త‌గ్గ‌కుండా ఉంటుంది.మ‌తిమ‌ర‌పు, నిద్ర‌లేమి, వేడి ఆవిర్లు వంటి స‌మ‌స్య‌ల‌కు సైతం దూరంగా ఉండొచ్చు.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఈ డైరెక్టర్లతో సినిమాలు చేస్తాడా..?

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఈ డైరెక్టర్లతో సినిమాలు చేస్తాడా..?