ఆ తప్పు కారణంగానే వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత వచ్చింది: అశ్వినీ దత్
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రొడ్యూసర్ అశ్వినీ దత్( Aswini Dutt ) .
వైజయంతి మూవీస్ బ్యానర్స్ స్థాపించిన ఈయన తన బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం తన బ్యానర్ ద్వారా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇటీవల కల్కి సినిమా ( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశ్వినీ దత్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కేవలం విడుదలైన 15 రోజులకే 1000 కోట్ల కలెక్షన్లను సాధించే సంచలనం సృష్టించింది.
ఇంకా ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.ఇలా సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అశ్వినీ దత్ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
"""/" /
ఈ సినిమా విడుదలకు ముందు జగన్ పాలనపై గట్టిగా వాదనను వినిపించిన సంగతి మనకు తెలిసిందే.
ఇదే విషయం గురించి రిపోర్టర్స్ ప్రశ్నించారు.ఇంత పెద్ద సినిమాని పెట్టుకొని మీరు జగన్ పట్ల ఆయన పాలన పట్ల బలంగా మీ వాదన వినిపించారు కారణం ఏంటని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అశ్వినీ దత్ సమాధానం చెబుతూ నాకు జగన్ అంటే ఎలాంటి శత్రుత్వం లేదు మా ఇద్దరి మధ్య చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది.
ఇక జగన్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని( Chandra Babu Naidu ) అరెస్టు చేసి తప్పు చేశారో ఆ క్షణమే ఆయన పట్ల వ్యతిరేకత ఏర్పడింది.
అప్పుడే ఈసారి నేను చంద్రబాబు అధికారంలోకి వస్తారని భావించాను.ఆ నమ్మకంతోనే 160 సీట్లకు పైగా కూటమి గెలుస్తుందని చెప్పాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?