రివ్యూ : 'అశ్వథ్థామ'గా అయినా సక్సెస్ అయ్యాడా?
TeluguStop.com
నాగశౌర్య హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అయినా కూడా దక్కించుకున్న సక్సెస్ లు మాత్రం కొన్నే.
అయినా కూడా సొంత బ్యానర్‌లో వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.నష్టాలు వస్తున్నా కూడా కొడుకును హీరోగా నిలబెట్టేందుకు శౌర్య తల్లి ఉషా గారు సినిమాలు నిర్మిస్తునే ఉన్నారు.
మరి ఈ చిత్రం కూడా హోమ్ బ్యానర్ లోనే వచ్చింది.మరి సినిమా ఎలా ఉందో చూడాలి.
H3 Class=subheader-styleకథ : /h3p
తన చెల్లికి ఎదురైన ఒక కష్టం గురించి బాధపడే అన్నయ్య నాగశౌర్య అందుకు కారణం అయిన వారిపై పోరాటం మొదలు పెడతాడు.
ఆ క్రమంలోనే అతడికి షాకింగ్‌గా తన చెల్లి మాదిరిగానే చాలా మంది అలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని, ఒక వ్యక్తి అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకుని సొంతంగా ఎంక్వౌరీ చేసి అతడిని పట్టుకుంటాడు.
ఇంతకు ఆ విలన్ ఎవరు? ఆ విలన్ చేసే పని ఏంటీ? అనేది సినిమా కథాంశం.
H3 Class=subheader-styleనటీనటుల నటన : /h3p
నాగశౌర్య మాస్ పాత్రల్లో కంటే క్లాస్ పాత్రల్లోనే ఆకట్టుకుంటాడు అనే విషయం గత సినిమాలతోనే నిరూపితం అయ్యింది.
అయినా కూడా నాగశౌర్య మళ్లీ మళ్లీ మాస్ పాత్రల్లోనే నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.
ఈ పాత్రకు నాగశౌర్య కాకుండా ఇంకా మరే మాస్ హీరో చేసినా కూడా చాలా బాగుండేది.
ఈ పాత్ర చాలా ఎమోషనల్ మరియు అగ్రసివ్‌గా ఉంటుంది.దాన్ని పూర్తి స్థాయిలో పండించడంలో నాగశౌర్య విఫలం అయ్యాడు.
ఇక హీరోయిన్ మెహ్రీన్ ఉందా లేదా అన్నట్లుగా ఉంది.పాటల్లో ఈమె స్కిన్ షోతో మెప్పించే ప్రయత్నం చేసింది.
ఇక ఇతర విషయాల్లో ఈ అమ్మడు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఇతర పాత్రలో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి పర్వాలేదు అనిపించారు.
H3 Class=subheader-styleటెక్నికల్ : /h3p
సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది.
ప్రతి పాట కూడా సినిమాకు చిన్న పాటి ఇంటర్వెల్ అన్నట్లుగా ఉంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా చెప్పుకునేట్లుగా ఏమీ లేదు.
మొత్తానికి ఈ చిత్రంలో సంగీతం మైనస్‌గా నిలిచింది.సినిమాటోగ్రఫీ బాగుంది.
ముఖ్యంగా కొన్ని చేజింగ్ సీన్స్‌ను మంచి సినిమాటోగ్రఫీతో చిత్రీకరించారు.ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.
కొన్ని సీన్స్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.దర్శకుడు కథ కథనం విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సింది.
స్క్రీన్‌ప్లేను ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించి ఉంటే బాగుండేది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
H3 Class=subheader-styleవిశ్లేషణ : /h3p
ఒక మంచి కాన్సెప్ట్‌తో.కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కాని దాన్ని కథగా మల్చడంలో దర్శకుడు మరియు రచయితలు విఫలం అయ్యారు.కథను కాస్త ఆసక్తికరంగా ట్విస్ట్‌లతో సాగించి ఉంటే బాగుండేది.
నాగశౌర్యను పూర్తి మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేశారు.కాని నాగశౌర్య లుక్స్ మరియు బాడీ లాంగ్వేజ్ మాస్ హీరోలా ఉండవు.
దాంతో ఆ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు.ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
కనుక సినిమాపై ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.కాని సినిమా మొత్తం ఓవరాల్‌గా చూస్తే మాత్రం నిరుత్సాహంగానే ఉంది.
"""/"/
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ : /h3p
స్టోరీలైన్,
కొన్ని చేజింగ్ సీన్స్,
ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్ : /h3p
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం,
సంగీతం,
హీరో హీరోయిన్ మద్య కెమిస్ట్రీ లేకపోవడం, కామెడీ లేకపోవడం
H3 Class=subheader-styleచివరగా :/h3p
అశ్వథ్థామలో అక్కడక్కడ మాత్రమే మెరుపులు ఉన్నాయి
H3 Class=subheader-styleరేటింగ్ :/h3ph3 Class=subheader-style 2.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!