Asus Zenfone 11 Ultra Smartphone : అసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్.. ఫీచర్లు ఇవే..!

అసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్( Asus Zenfone 11 Ultra Smartphone ) ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

భారత కాలమానం ప్రకారం మార్చి 14వ తేదీ సాయంత్రం 5:30pm కు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనుంది.

జెన్ ఫోన్ 11 అల్ట్రా ఈవెంట్( Zenfone Ultra Event ) ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లేదా యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

అయితే అసుస్ జెన్ ఫోన్ 11అల్ట్రా స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయం పై స్పష్టత లేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.అసుస్ తన జెన్ ఫోన్ లైనప్ లో అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించడం ఇదే తొలిసారి.

ఈ ఫోన్ S24 ప్లస్ లేదా ఐఫోన్ 15 ప్లస్ కు సమానమైన ఫీచర్లతో ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది.

"""/"/ ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల FHD+LTPO AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.

HDR10+సపోర్ట్,144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

డాల్బీ అట్మోస్ సపోర్ట్, 3.5 Mm ఆడియో జాక్ తో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లతో ఉంటుంది.

స్నాప్ డ్రాగన్ 8జెన్ 3SoC ద్వారా పని చేస్తుంది.16GB RAM+ 512GB వరకు UFS 4.

0స్టోరేజ్ తో జత చేయబడుతుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 65w వైర్,15w వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

"""/"/ ఈ ఫోన్ గింబాల్ OIS తో 50ఎంపీ సోనీ IMX 890 ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్,OIS మరియు 3x ఆప్టికల్ జూమ్ తో కూడిన 32ఎంపీ టెలిఫోటో యూనిట్ తో రానుంది.

సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో( 32MP Front Camera ) ఉంటుంది.

ఈ ఫోన్ స్కైలైన్ బ్లూ, మిస్టీ గ్రే, వెర్డ్యూర్ గ్రీన్, ఎటర్నల్ బ్లాక్ రంగులలో ఉంటుంది.

ఇక ఈ ఫోన్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

చరణ్ పై విమర్శలు చేసిన వాళ్లకు స్వామీజీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన ఏమన్నారంటే?