బాల్య మిత్రునికి లక్ష రూపాయల సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్నేహమంటే ఆడుకోవడమే కాదు.ఆపదలో ఆదుకోవడం అని నిరూపించారు చందుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదివిన 96-97 నాటి విద్యార్థులు.

చిన్ననాటి మిత్రుడు చందుర్తి గొల్లపల్లి గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని,అందరూ కలిసి డబ్బులు పోగు చేసి గురువారం గణేష్ ను పరామర్శించి మెరుగైన వైద్యానికి లక్ష రూపాయలు అందజేశారు.

స్నేహమంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు.ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే ఉన్నామని భుజం తట్టిన స్నేహితులు చందుర్తి 96-97 బ్యాచ్.

బంధంగా పుట్టకపోయిన.అనుబంధంగా రూపుదిద్దుకొని.

కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గణేష్ కు చేసిన సాయం నేటి యువతకు ఆదర్శప్రాయం ఈ బ్యాచ్ మిత్రులని గ్రామస్తులంటున్నారు.

పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన చిరు అభిమాని.. ఈ అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!