జాబ్ రిజక్ట్ కావడానికి ఆమె ఇంటి పేరే కారణం.. ఎందుకంటే?

చిన్నప్పటి నుండి కష్టమైన ఉద్యోగం చేసిన నాలుగు రాళ్ళూ సంపాదించే కోసం 20 ఏళ్లు కష్టపడి చదువుతారు.

తీరా ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే ఇంగ్లీష్ రాదు అని, ఉద్యోగానికి వయసు లేదని రిజెక్ట్ చేస్తారు.

వందలో 99 శాతం మందికి ఇలాంటి చీప్ రీజన్స్ ఏ చెప్పి రిజెక్ట్ చేస్తారు.

ఓ మహిళకు జాబ్ రిజెక్ట్ అయ్యింది.ఆమెకు ఇలాంటి రీజన్ ఏ అయ్యి ఉంటే ఆవిడా మాట్లాడేది కాదు ఏమో.

కానీ ఆమెను అవమాన పరిచే రీజన్ అది.ఆమెను మాత్రమే కాదు ఆమె కుటుంబసభ్యులను అందరిని అవమానపరిచే రీజన్ వాళ్ళు చెప్పారు.

ఏంటి అనుకుంటున్నారా? ఆమె ఇంటి పేరే ఆమె జాబ్ రిజెక్ట్ అవ్వడానికి కారణమట.

ఎందుకంటే ఆమె ఇంటి పేరు ఆ భాషలో ఒక బూతు అంట.ఆమె ఇంటి పేరులో పలకడానికి అభ్యంతరకరంగా ఉన్న బూతు పదం ఉందనే కారణంతో ఆ సంస్థ ఆమె దరఖాస్తును స్వీకరించడం లేదు.

దీంతో ఆమెకు వేరే దారిలేక తన బాధనంతా ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది.వివరాల్లోకి వెళ్తే.

ఆమె పేరు ప్రియాంక చుతియా.అస్సాంలోని గోముఖ్‌కు చెందిన ప్రియాంక అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

ఇటీవల ఆమె ప్రభుత్వానికి చెందిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చెయ్యడానికి ప్రయత్నించగా సరైన పేరును పెట్టాలంటూ అప్లికేషన్ రిజెక్ట్ చేసింది.

దానికి కారణం ఆమె ఇంటి పేరు.చుతియా అనేది హిందీలో బూతు పదం.

భారత్ లో ఎక్కువ మంది దీన్ని తిట్టుగా ఉపయోగిస్తారు.అందుకే ప్రభుత్వ సైట్లలో అలాంటి పదాలు ఉండకూడదనే ఉద్దేశంతో నిషేదిత పదాల జాబితాలో ఆ పదాన్ని చేర్చారు.

దీంతో ఆమె బాధను అంత ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.''నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వానికి చెందిన పెద్ద సంస్థ నా ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తోంది.

ఇందుకు కారణం నా ఇంటి పేరే.నేను ఆ పేరు ఎంటర్ చేస్తే సరైన పేరును రాయాలని చెబుతోంది.

నాకు చాలా బాధ, చికాకుగా ఉంది.నేను వాడుతున్న భాష కాదని, మా సామాజిక వర్గానికి చెందిన ఇంటి పేరును అని చాలామందికి చెప్పి చెప్పి విసిగిపోయాను.

మాకు తప్పకుండా జాతీయస్థాయిలో గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నా.ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు.

పరిచయ ప్రసంగం ఇస్తున్నప్పుడు నా పేరు విని నవ్వుతుంటే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి'' అంటూ ఆమె ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.

దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు సానుభూతి తెలుపుతున్నారు.

రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు..: హరీశ్ రావు