ట్రాఫిక్ పోలీసునే కొట్టిన ఆటో డ్రైవర్.. వీడియో చూస్తే షాకే..
TeluguStop.com
ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవడం సహజమే.
ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి.మరి కొన్నిసార్లు జంతువులకు, టెక్నాలజీ సంబంధించి, గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.
మామూలుగా ఎక్కడైనా సరే పోలీసులు అదుపు తప్పి ప్రజలపై చేయి చేసుకున్న సంఘటనలు చాలానే చూశాము.
అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ ఆటో డ్రైవర్( Auto Driver ) నడిరోడ్డుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టాడు.
"""/" /
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.అస్సాంలోని( Assam ) దిబ్రూగఢ్, నలియాపూల్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం.
వైరల్ గా మారిన వీడియోలో ఆటో డ్రైవర్ రోడ్డుపై చెంప మీద కొట్టడం క్లియర్ గా కనబడుతుంది.
నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్( Police Constable ) చెంప దెబ్బ కొట్టి ఇష్టానుసారం అతనిని దుర్భాషలాడడం చూడవచ్చు.
ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు ఆటో డ్రైవర్ పై మండిపడుతున్నారు.
"""/" /
మనము రోడ్లపై ప్రయాణం చేసుకున్న సమయంలో అనేక ట్రాఫిక్ సమస్యలను చాలా చాకచక్యంగా నిర్వహిస్తూ మనల్ని సరైన సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఇలా చేయి చేసుకోవడం తప్పు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
మరికొందరేమో ఇలాంటి బరితెగించిన వారిని కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో సదరు ఆటో డ్రైవర్ని పట్టుకోవడానికి ఆ ప్రాంత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!