డి‌ఎం‌కే మహానాడు కు అసదుద్దీన్

తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికార, ప్రతి పక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ అయిన డి‌ఎం‌కే రాయపేటలోని వై‌ఎం‌సి‌ఏ మైదానంలో "హృదయాలను కలుపుదాం" పేరిట మహానాడును నిర్వహిస్తుంది.

ఈ మేరకు డి‌ఎం‌కే మైనారిటీ సంక్షేమ కార్యదర్శి మస్తాన్ ఎం‌ఐ‌ఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీని ఆ వేడుకకు రావాలిసిందిగా కోరారు.

ఈ విషయంను మస్తాన్ తెలియజేశాడు.అందుకు అసద్ కూడా సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం.

అసద్ రాకతో అక్కడి ఇస్లామిక్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. """/"/ తమిళ ప్రజలు సైతం అసద్ పై కోపంతో ఉన్నారు.

దానికి కారణం బిహార్ ఎన్నికల ఫలితాలు అని తెలుస్తుంది.ఎం‌ఐ‌ఎం పార్టీ బిహార్ లో పోటీ చెయ్యడం ద్వారా ఓట్లు చిల్చిందని అందుకే అక్కడ బి‌జే‌పి గెలిచిందని తమిళ ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుచ్చికి చెందిన నూర్ అహమ్మద్ మాట్లాడుతూ అసద్ ద్వారా ముస్లిం ప్రజల ఓట్లను రాబట్టోచ్చని చూస్తున్న డి‌ఎం‌కే పార్టీకి ఓరిగేది ఏమీలేదని అన్నాడు.

తమిళ మైనారిటీ ప్రజల నుండి డి‌ఎం‌కే పార్టీపై విమర్శలు వస్తుండటంతో కూటమి పార్టీలు మాత్రమే మహానాడుకు ఆహ్వానించామని ఆ పార్టీ స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !