అబ్బా ఏం తెలివి.. ముంబై పోలీసు పరీక్షలో చిరంజీవి స్టైల్‌లో మోసం..!

సినిమాల్లో చూసే మోసాలు నిజ జీవితంలోనూ జరుగుతాయనడానికి ముంబైలో( Mumbai ) జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

శంకర్ దాదా MBBS( Shankar Dada MBBS ) సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) పరీక్షలో చీటింగ్ చేసినట్టుగానే, ముంబై పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు హైటెక్ మాయాజాలంతో అడ్డంగా దొరికిపోయాడు.

కృష్ణా దల్వి అనే 22 ఏళ్ల ఈ యువకుడు మహారాష్ట్రలోని( Maharashtra ) జల్నా జిల్లా నివాసి.

ముంబైలోని ఓషివారాలోని రాయ్‌గఢ్ మిలిటరీ బేస్‌లో ఎగ్జామ్‌ రాస్తుండగా అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.

పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అతడి కదలికలు తేడాగా అనిపించడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

"""/" / పోలీసులు షాక్ అయ్యేలా కృష్ణా తన ఎడమ చెవిలో ఓ చిట్టి హియరింగ్ డివైజ్( Hearing Device ) దాచుకున్నాడు.

ఇది బ్లూటూత్( Bluetooth ) ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంది.అంతేకాదు, కృష్ణా స్నేహితులు సచిన్ బవాస్కర్‌, ప్రదీప్ రాజ్‌పుత్‌లు ఫోన్ ద్వారా సమాధానాలు చెబుతూ అతనికి సహకరిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా ఎగ్జామ్ హాల్‌లో చీటింగ్ చేయాలనుకున్న ఈ ముగ్గురి ప్లాన్ బెడిసికొట్టింది.

"""/" / వెంటనే పోలీసులు కృష్ణా నుంచి హియరింగ్ డివైజ్, మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.

సచిన్, ప్రదీప్‌లు కూడా చీటింగ్‌కు సహకరించారని తేలడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఈ చీటింగ్ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన 2004లో వచ్చిన 'శంకర్ దాదా MBBS' సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేసింది.

ఆ సినిమాలో చిరు మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో వైర్డ్ ఇయర్‌పీస్ ఉపయోగించి సమాధానాలు తెలుసుకుంటాడు.

ఇప్పుడు కృష్ణా కూడా అదే తరహాలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మోసానికి పాల్పడటం గమనార్హం.

ఈ ఘటన పరీక్షల్లో టెక్నాలజీ వినియోగం, ఇలాంటి మోసాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు దారితీసింది.

కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ, ఇలాంటి చీటింగ్ పద్ధతులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?