విడాకుల రూమర్లపై స్పందించిన ఆసిన్… టైం వేస్ట్ అంటూ ఆగ్రహం!

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సీనియర్ నటి ఆసిన్( Asin ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె 2016వ సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను( Rahul Sharma ) వివాహం చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చి తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఈ విధంగా తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత రెండు రోజులుగా ఒక వార్త వైరల్ గా మారింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/06/Asin-responded-to-the-orce-rumoursa!--jpg" / ఈ విధంగా విడాకులు( Divorce ) తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై ఆసిన్ స్పందిస్తూ పూర్తిగా ఈ వార్తలను కొట్టి పారేశారు.

ఈ సందర్భంగా ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తాను తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ లో చాలా ఎంజాయ్ చేశానని ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి చాలా విలువైన సమయాన్ని గడుపుతున్నానని తెలియజేశారు.

గత రెండు రోజులుగా తనకు సంబంధించిన ఒక నిరాధారణమైనటువంటి వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/06/Asin-responded-to-the-orce-rumoursb!--jpg" / ఇక నేను తన భర్తతో కలిసి ఇదివరకే బ్రేక్ ఫాస్ట్ కూడా పూర్తి చేసామని తెలిపారు.

మేం విడిపోతున్నామని ఒక బేస్ లెస్ వార్త విన్నానని, ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటూ తన విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు.

ఇది వినండి నేను ఈ పోస్ట్ చేయడానికి కేటాయించిన ఈ ఐదు నిమిషాల సమయం కూడా వృధా అయిందని తాను చాలా నిరాశపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా విడాకుల వార్తలపై స్పందిస్తూ ఈమె ఘాటుగా రిప్లై ఇచ్చారు.

ఈ విధంగా విడాకుల వార్తలపై ఆసిన్ స్పందించడంతో ఈ వార్తలకు ఇంతటితో పులిస్టాప్ పడినట్లు అయ్యింది.

ఆ తప్పు కారణంగానే వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత వచ్చింది: అశ్వినీ దత్