భారత్-పాక్ మ్యాచ్ రద్దు..రోహిత్, కోహ్లీ పేలవ ఆట ప్రదర్శన..!

తాజాగా జరిగిన భారత్-పాకిస్తాన్( India Vs Pakistan ) మధ్య మ్యాచ్ కు మొదటి నుండి వరుణుడు అడ్డంగా నిలిచాడు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు( India ) 266 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

భారత జట్టు బ్యాటర్లైన రోహిత్ శర్మ 11,( Rohit Sharma ) శుభ్ మన్ గిల్ 10,( Subhman Gill ) విరాట్ కోహ్లీ 4,( Virat Kohli ) శ్రేయస్ అయ్యర్ 14 పరుగులతో పేలవ ఆటను ప్రదర్శించి చాలా తీవ్రంగా నిరాశపరిచారు.

భారత జట్టు 66 పరుగులకే టాపార్డర్ ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే ఇషాన్ కిషన్,( Ishan Kishan ) హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) అద్భుతమైన పార్టనర్ షిప్ కొనసాగించి అర్థ శతకాలు చేయడంతో భారత ఇన్నింగ్స్ చక్కబడింది.

భారత్ 66 పరుగుల వద్ద తన నాలుగో వికెట్ కోల్పోయి ఐదో వికెట్ ను 204 పరుగుల వద్ద కోల్పోయింది.

ఆ తర్వాత హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ కనీసం 250 పరుగులైన చేస్తుందా అనే అనుమానం కలిగింది.

"""/" / చివరికి 48.4 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయిన భారత్ 266 పరుగులు చేసింది.

పాకిస్తాన్ జట్టు( Pakistan ) పేసర్లు భారత బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు.

మ్యాచ్ ఆరంభంలోనే పాక్ జట్టు బౌలర్ షాహిన్ షా ఆఫ్రిది భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తొందరగా పెవిలియన్ పంపించాడు.

"""/" / ఇక రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను కూడా ఒకే ఓవర్ లో అవుట్ చేసి షాహిన్ షా ఆఫ్రిది( Shaheensha Afridi ) మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

షాహిన్ షా ఆఫ్రిది 4, నసీమ్ షా 3, రవుఫ్ 3 వికెట్లు తీశారు.

వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.చాలా సేపటి వరకు ఎదురుచూసిన వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తూ ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు.

భారత జట్టు బ్యాటర్లైన ఇషాన్ కిషన్ 82, హార్దిక్ పాండ్యా 86 పరుగులతో రాణించారు.

కల్కి మూవీలో కృష్ణుడి పాత్రను పోషించింది ఇతనే.. ఆ తమిళ నటుడికి ఛాన్స్ దక్కిందా?