ఆసియా కప్ నిర్వహణ వేదిక మారనుందా.. పీసీబీతో ఏసీసీ చర్చలు..!

ఆసియా క్రికెట్ కప్( Asia Cricket Cup ) పాకిస్తాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుందని అందరికీ తెలిసిందే.

అయితే భారత్( India ) ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు( Pakistan ) వెళ్ళేది లేదని ఐసీసీ కి తేల్చి చెప్పేసింది.

ఒకవేళ ఆసియా కప్ లో భారత్ జట్టు పాల్గొనాలంటే తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని బీసీసీఐ( BCCI ) కోరింది.

ఐసీసీ ఎన్నో చర్చలు జరిపి పాకిస్తాన్ ను ఒప్పించి, పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తూ, భారత్ కోసం తటస్థ వేదికలు ఏర్పాటు చేద్దామనుకుంది.

"""/" / కానీ భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ ను అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ తనకు కూడా తటస్థ వేదికలు కావాలని తెర పైకి కొత్త సమస్యలను తీసుకువచ్చింది.

దీంతో ఐసీసీకి పెద్ద చిక్కే వచ్చి పడింది.ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసియా క్రికెట్ కప్ ను శ్రీలంకలో నిర్వహించాలని కోరుతున్నాయి.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా పాకిస్తాన్లో కాకుండా మరో దేశంలో ఆసియా క్రికెట్ కప్ నిర్వహించాలని అభిప్రాయపడుతుంది.

అయితే పాకిస్తాన్ తో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.పాకిస్తాన్ మొండికేస్తే కచ్చితంగా ఆసియా క్రికెట్ కప్ వేదిక మారనుంది.

"""/" / భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయని అందరికీ తెలిసిందే.

ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు వెళితే ఉద్రిక్తతలు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి రెండు దేశాల శాంతి కోసమే బీసీసీఐ భారత జట్టును పాకిస్తాన్ కు పంపించేది లేదని, ఈ నిర్ణయంలో మార్పులు ఉండవని స్పష్టంగా తెలిపింది.

పాకిస్తాన్ మాత్రం నిలకడ లేని వాదనలు చేస్తూ తాము కూడా వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ కు వచ్చేది లేదని బెదిరించే ప్రయత్నం చేస్తోంది.

రెండో విడత పాకిస్తాన్ తో ఏసీసీ చర్చలు జరుపనుంది.పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోతే బిగ్ క్రికెట్ ఈవెంట్ నిర్వహణను కోల్పోవాల్సిందే.

దీంతో పాకిస్తాన్ కు తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అయింది.

పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య శోభిత.. వైరల్ అవుతున్న వార్తల్లో అసలు నిజాలు ఇవే!