Aswini : బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) తెలుగు అయిదు వారాలు పూర్తి చేసుకుంది.

ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.ఇలా ఐదు వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోవడమే కాకుండా ఈ ఆదివారం మరొక ఐదు మంది కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున హౌస్ లోకి పంపించారు.

"""/" / ఈ విధంగా ఒక్కొక్క కంటెస్టెంట్ హౌస్ లోకి వెళుతూ అందరిని సర్ప్రైజ్ చేశారు.

అయితే ఇప్పటివరకు పెద్దగా ఎవరికి పరిచయం లేనటువంటి కంటెస్టెంట్ అశ్విని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించిన సంగతి మనకు తెలిసిందే.

దీంతో అసలు ఈ అశ్విని ( Aswini ) ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.

ఇక బిగ్ బాస్ వేదికపై అశ్విని మాట్లాడుతూ తనకు చిన్నప్పటినుంచి కూడా నటన వైపు రావాలని ఎంతో ఆశగా ఉండేది కానీ ఇదే విషయం మా అమ్మ వాళ్లకు చెబితే వాళ్ళు ఒప్పుకోలేదని అశ్విని తెలియజేశారు.

ముందు చదువు పూర్తి చేయమని చెప్పారు./br> """/" / ఇలా వరంగల్ నెట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత తాను ఇండస్ట్రీ వైపు రావాలని భావించి ఇదే విషయం అమ్మతో చెబితే అమ్మ తనకు సపోర్ట్ చేసిందని తెలిపారు.

ఇలా తనకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడంతో మెల్లిమెల్లిగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.

ఈ క్రమంలోని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇక మహేష్ బాబు రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా( Sarileru Neekevvaru )లో కూడా ఈమె ఒక చిన్న పాత్రలో నటించారు.

"""/" / ఇక ఈ సినిమాలోనే కాకుండా మరికొన్ని సినిమాలలో కూడా ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇలా అవకాశాల కోసం ఈమె ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకొని సందడి చేస్తున్నారు.

అయితే ఇలా సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం చేత తనకు బిగ్ బాస్ అవకాశాన్ని కల్పించాలని తెలుస్తోంది.

మరి బిగ్ బాస్ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈమె గుర్తింపు సంపాదించుకొని తిరిగి సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటారా లేక ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్యూర్ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి అశ్విని సినిమాలపై ఆసక్తితో సినిమాలలోకి రావాలన్న ప్రయత్నం ఎంతో గొప్పదని అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందని తెలుస్తుంది.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి… చంపడానికే కుట్ర… మనోజ్ సంచలన వ్యాఖ్యలు!