అశ్వనీదత్‌ సీనియర్ ఎన్టీఆర్‌ని కలవడానికి ఏం చేశారో తెలిస్తే షాకే..?

టాప్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లలో అశ్వనీదత్‌( Ashwinidath ) ఒకరు.అశ్వనీదత్‌ సినిమా రంగంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు.

ఆయన తన జీవితంలో దాదాపు 50 సంవత్సరాల కాలాన్ని సినిమాలకే అంకితం చేశారు.

దత్ ఎక్కువగా తెలుగు సినిమాలను నిర్మించినా, హిందీ, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేశారు.

దత్ సినిమాలు లవిష్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో చూడటానికి చాలా బాగుంటాయి.ఎందుకంటే ఆయన సినిమాలను చాలా ఖర్చుతో, అద్భుతంగా తీస్తారు.

"""/" / అశ్వనీ దత్‌ 1974లో ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ "వైజయంతి మూవీస్"ను( Vayjayanthi Movies ) స్థాపించారు.

దీన్ని స్టార్ట్ చేసిన ఒక్క సంవత్సరం తర్వాత సీనియర్ ఎన్టీఆర్‌తో( NTR ) కలిసి "ఎదురు లేని మనిషి" ప్రొడ్యూస్ చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గ్రేటెస్ట్ మూవీస్ నిర్మించిన ఘనత వైజయంతి మూవీస్‌కే దక్కింది.

ఆయన తీసిన మొట్టమొదటి సినిమా ఎన్టీఆర్ దే కావడం విశేషం.అంత పెద్ద స్టార్ హీరో సినిమా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఊరికే రాలేదు.

అశ్వినీ దత్ ఎన్టీఆర్ ను సినిమా ఒప్పించడానికి ముందు చాలానే కష్టపడ్డారు. """/" / తాజాగా అశ్వనీదత్‌ కుమార్తె స్వప్నా దత్ ( Swapna Dutth )చలసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి ఎన్టీఆర్ ని కలవడానికి, తన సినిమాలో నటించమని ఒప్పించడానికి ఎంత కష్టపడినారో తెలిపింది.

ఆమె మాట్లాడుతూ "మా నాన్న రోజూ ఉదయం 3:30 గంటలకు సీనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిలుచుకునేవారు.

ఎన్టీఆర్ గారు ఉదయం 4 లేదా 4:30 సమయంలో వాకింగ్ కి వెళ్లేవారు.

ఆయన కారులో ఏవీఎం స్టూడియో వద్దకు వెళ్లి అక్కడ వాకింగ్ చేసేవారు.మా నాన్న రోజూ ఉదయం 3:30 గంటలకు నిలబడటం ఎన్టీఆర్ అప్పుడప్పుడు చూసేవారు.

అలా నెలలు తరబడి మా నాన్నను చూడడంతో ఆయనను ఒకరోజు ఇంట్లోకి పిలిపించారు.

తర్వాత 'ఏంటి సంగతి, ఎందుకు ఇక్కడ నిల్చుంటున్నావు?' అని అడిగితే 'మీతో సినిమా తీయాలనుకుంటున్నాను' అని చెప్పారట.

ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి మా నాన్న చెప్పిన కథ నచ్చడం, ఒప్పుకోవడం జరిగిపోయింది.

అలా మా నాన్న నిర్మించిన మొదటి సినిమా ఎన్టీఆర్ గారిదే అయింది." అని చెప్పింది.

అశ్వినీ దత్ "శక్తి" సినిమా తీసిన తర్వాత ఏకంగా రూ.35 కోట్లు నష్టపోయారు.

దాని తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుదామనుకున్నారు కానీ కూతుర్లే అతని మళ్ళీ ప్రోత్సహించి సినిమాల్లో నిర్మాతగా కొనసాగే లాగా చేశారు.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ మీద క్లారిటీ వచ్చిందా..?