నాగ శౌర్యకి హిట్ గ్యారెంటీ... అశ్వథామ సెన్సార్ టాక్

టాలీవుడ్ లో క్యూట్ లుక్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగ శౌర్య.

ఈ కుర్ర హీరో కెరియర్ లో చేసిన సినిమాలు చాలా వరకు హిట్ టాక్ తెచ్చుకున్న అతనికి మాత్రం ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు.

దీంతో ఎలా అయిన సోలో హీరోగా హిట్ కొట్టి తన మార్క్ చూపించుకోవాలనే కసితో తన తల్లిని నిర్మాతగా మార్చి సొంత బ్యానర్ లోనే సినిమాలు తెరకేక్కిస్తున్నాడు.

ఇలా సొంత బ్యానర్ లో చలో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.అయితే మళ్ళీ నర్తనశాల అంటి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ సారి ఎలా అయిన కమర్షియల్ హీరోగా హిట్ కొట్టాలని రచయితగా కూడా మారి కథ రాసుకున్నాడు.

అలా నాగ శౌర్య సొంత కథతో రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అశ్వథామ.

కమర్షియల్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ఇక ఈ నెల ఆఖరున ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో శౌర్య ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సినిమా చూసిన సెన్సార్ అధికారులు క్లిన్ యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

సినిమా చాలా భాగుందని, శౌర్య ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించాడని, కచ్చితంగా హిట్ గారంటీ అని చెప్పినట్లు తెలుస్తుంది.

సెన్సార్ వారి నుంచి పోజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.

తండ్రి కూరగాయల వ్యాపారి.. కూతురు యూపీఎస్సీ ర్యాంకర్.. స్వాతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!