అషురెడ్డిపై ఫైర్ అయిన కన్నతల్లి.. ఏం జరిగిందంటే..?

జూనియర్ సమంతగా టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షో ద్వారా ఆ పాపులారిటీని ఊహించని స్థాయిలో మరింత పెంచుకున్న సంగతి తెలిసిందే.

కొన్ని నెలల క్రితం రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం అషురెడ్డి స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

అయితే అషురెడ్డిపై ఆమె కన్నతల్లి ఫైర్ అయ్యారు.సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే అషురెడ్డి తాజాగా హ్యాండ్ బ్యాగ్ గురించి చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఆమె తల్లి చేతిలో తిట్లు తిన్నారు.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అషురెడ్డి తన అల్లరికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు.

అషురెడ్డి తన తల్లికి ఒక హ్యాండ్ బ్యాగ్ ను చూపించి ఆ హ్యాండ్ బ్యాగ్ ను లక్షన్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేశానని చెప్పారు.

ఆ హ్యాండ్ బ్యాగ్ ను చూసిన అషురెడ్డి తల్లి హ్యాండ్ బ్యాగ్ నిజంగా అంత ఖరీదు చేస్తుందా.

? అని ఆమెను ప్రశ్నించారు. """/"/ ఆమె నిజంగా ఖరీదు చేస్తుందని చెప్పడంతో అషురెడ్డి తల్లి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఆ తరువాత అషురెడ్డి ఇచ్చిన బ్యాగ్ ను ఆమె తల్లి విసిరికొట్టారు.ఇప్పటికే ఇంట్లో ఎన్నో హ్యాండ్ బ్యాగ్ లు ఉండగా ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకని కూతురిపై అషురెడ్డి తల్లి సీరియస్ కావడం గమనార్హం.

"""/"/ అయితే తల్లి సీరియస్ అవుతుంటే కూతురు అషురెడ్డి మాత్రం పడీపడీ నవ్వారు.

ఆ హ్యాండ్ బ్యాగ్ తనకు బహుమతిగా వచ్చిందని అషురెడ్డి చెప్పి తన తల్లిని కూల్ చేశారు.

ప్రస్తుతం అషురెడ్డి పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుండగా వేల సంఖ్యలో ఈ వీడియోకు లైకులు వస్తున్నాయి.

వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!