ఇస్రోకు నో చెప్పి 52 లక్షల ప్యాకేజ్ సాధించిన రైతుబిడ్డ.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

కొంతమంది సక్సెస్ స్టోరీలు ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు అందరిలో స్పూర్తి నింపుతూ ఉంటాయి.

బీటెక్ చదివిన తర్వాత మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే.

ఆ కల నిజమైతే మాత్రం ఆనందానికి అవధులు ఉండవు.రైతుబిడ్డ అశ్రిత( Ashritha ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

చాలామంది సాఫ్ట్ వేర్ జాబ్ సాధిస్తే మాత్రమే మంచి ప్యాకేజ్ ఉంటుందని ఫీలవుతారు.

అయితే రైతుబిడ్డ అశ్రిత మాత్రం హార్డ్ వేర్ రంగంలో సైతం సత్తా చాటవచ్చని ప్రూవ్ చేసింది.

తల్లీదండ్రులకు చదువు రాకపోయినా సొంత ప్రయత్నాలతో కష్టపడి లక్ష్యాన్ని సాధించిన అశ్రితను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో( Multi National Company ) ఉద్యోగం సాధించిన ఈ యువతి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తూ కెరీర్ పరంగా ఎన్నో మెట్లు పైకి ఎక్కుతున్నారు.

"""/" / అశ్రిత యంగ్ జనరేషన్ లో సైతం ఎంతోమందికి స్పూర్తి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

రైతుబిడ్డ అయిన అశ్రిత తన సక్సెస్ స్టోరీతో( Success Story ) ప్రశంసలు అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు( Karimnagar District ) చెందిన అశ్రిత తన సక్సెస్ తో ఔరా అనిపిస్తున్న ఈ యువతిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

"""/" / ఈ యువతి 2022లో గేట్ పరీక్షలో 36వ ర్యాంక్ సాధించారు.

సాఫ్ట్ వేర్ రంగంపై ఆసక్తి లేక గేట్ ప్రిపేర్ అయ్యి లక్ష్యాన్ని సాధించడం కొసమెరుపు.

ఈ ఏడాది ఎంటెక్ పూర్తి చేసిన ఈ యువతి జులై 29వ తేదీన ఉద్యోగంలో జాయిన్ కానున్నారు.

అశ్రిత సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.అశ్రిత మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై23, మంగళవారం 2024