పది, ఇంటర్ రెండుసార్లు ఫెయిల్.. 2463 కోట్లు సంపాదించిన అష్రఫ్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
దేశంలో చాలామంది చదువుతున్న చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేదు.ప్రస్తుత కాలంలో పాస్ మార్కులు కూడా రాకపోతే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టమవుతుంది.
పరీక్షల్లో ఫెయిల్ అయితే కెరీర్ పరంగా సక్సెస్ దక్కదని చాలామంది భావిస్తారు.అయితే ఒకసారి లైఫ్ లో ఓడిపోయి ఎదురుదెబ్బలు తగిలినా సక్సెస్ సాధించడం సాధ్యమేనని మిస్బా అష్రఫ్ లాంటి వ్యక్తులు ప్రూవ్ చేస్తున్నారు.
పది, ఇంటర్ లో ఫెయిలైనా 2463 కోట్లు సంపాదించిన మిస్బా అష్రఫ్ ( Misbah Ashraf )సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
కాలేజ్ డ్రాపౌట్ మిస్బా అష్రఫ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మిస్బా అష్రఫ్ బీహార్( Bihar ) లో పుట్టి పెరగాడు.
తల్లి గృహిణిగా తండ్రి టీచర్ గా పని చేస్తుండగా ఐఐటీ ఢిల్లీలో సీటు వచ్చినా అష్రఫ్ మాత్రం తొలి ఏడాదే కాలేజ్ మానేశాడు.
"""/" /
నువ్వు నెమ్మదిగా నడిస్తే కొట్టుకుపోతావు అని తండ్రి చెప్పిన మాట అష్రఫ్ కు ఎన్నో జీవిత పాఠాలను నేర్పింది.
2013 సంవత్సరంలో అష్రఫ్ సిబోలా అనే కంపెనీని మొదలుపెట్టారు.అయితే ఈ సంస్థకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
2017లో అష్రఫ్ మార్స్ పే ( Marsplay )అనే సంస్థను మొదలుపెట్టగా ఈ సంస్థ భారీ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడంతో 2021లో ఫాక్సీ అనే సంస్థ ఈ సంస్థను కొనుగోలు చేసింది.
"""/" /
ఆ తర్వాత అష్రఫ్ మరో సంస్థను మొదలుపెట్టగా ఈ సంస్థకు ఏడాదిలోనే 2463 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
జార్ అనే పేరుతో అష్రఫ్ సాధించిన సంస్థ కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకుంటోంది.
ఈ సంస్థ ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ లో సైతం పెట్టుబడులు పెట్టే ఛాన్స్ అయితే ఉంది.
అష్రఫ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?