ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన 'హీరో ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
TeluguStop.com
ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడిగా, ఎంపీ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అశోక్ గల్లా గురించి అందరికీ తెలిసిందే.
ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.
గల్లా పద్మావతి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ, రోల్ రీడా కీలకపాత్రలలో నటించారు.
ఇలా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాను థియేటర్లో ప్రేక్షకులు పెద్దగా సందడి చేయలేకపోయినప్పటికీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ప్రతి సినిమా ఓటీటీలోవిడుదల అవుతుంది ఈ క్రమంలోనే హీరో సినిమా కూడా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
"""/"/
యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమాలో అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా కామెడీ తరహాలో ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇలా థియేటర్లో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి స్పందన దక్కించుకుంటుందో వేచి చూడాలి.
బరువు తగ్గి సన్నగా మారాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ తప్పక తీసుకోండి!