రెండుసార్లు ఫెయిల్.. 10 లక్షల మందితో పోటీ పడి 116వ ర్యాంక్.. ఐపీఎస్ ఆశ్నా సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
యూపీఎస్సీ( UPSC ) పరీక్షలో సక్సెస్ కావాలంటే రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమించడంతో పాటు లక్ష్యాన్ని సాధించే వరకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది.
ఫెయిల్యూర్స్ వచ్చినా వాటిని దాటుకుని ముందడుగులు వేసే సామర్థ్యం ఉంటే మాత్రమే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది.
రెండుసార్లు ఓటమిపాలైనా 10 లక్షల మందితో పోటీ పడి ఆశ్నా చౌదరి( Ashna Chowdary ) 116వ ర్యాంక్ సాధించారు.
"""/" /
యూపీ( Uttar Pradesh )లోని షిఖువా పట్టణానికి చెందిన ఆశ్నా చౌదరి తల్లి గృహిణిగా పని చేస్తుండగా తండ్రి ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
బాల్యం నుంచి చదువులో టాపర్ గా ఉన్న ఆశ్నా చౌదరి ఇంటర్ లో 96.
5 శాతం మార్కులు సాధించారు.ఢిల్లీలోని ప్రముఖ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన ఆశ్నా చౌదరి ఆ తర్వాత సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ను ప్రారంభించి ఒక ఎన్జీవో తరపున పేద విద్యార్థులకు విద్యను అందించారు.
2020 సంవత్సరంలో తొలి ప్రయత్నంలో సివిల్స్ కు హాజరైన ఆశ్నా చౌదరి ఆశించిన ఫలితం రాకపోవడంతో 2021లో మళ్లీ ప్రయత్నించారు.
అయితే రెండోసారి కూడా నిరాశ ఎదురైంది.2022లో మరోసారి పరీక్ష రాసిన ఆశ్నా చౌదరికి ఈ పరీక్షలో మంచి ఫలితాలు వచ్చాయి.
కష్టాలను ఎదుర్కొంటే సక్సెస్ సాధించడం సులువేనని ఆమె చెబుతున్నారు.ఓర్పుతో రోజుకు 6 గంటల పాటు కష్టపడితే సక్సెస్ దక్కుతుందని ఆశ్నా చౌదరి ప్రూవ్ చేశారు.
"""/" /
పట్టుదల, లక్ష్యం, సరైన ప్రణాళిక ఉంటే గమ్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఆమె చెబుతున్నారు.
మనకు మనం ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏదైనా సాధించగలమని ఆమె ప్రూవ్ చేస్తున్నారు.
ఆశ్నా చౌదరి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించిన ఆశ్నా చౌదరికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?