హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి మీకు తెలుసా.. ఇంతకుముందే ఆమె సినిమాలలో నటించిందా?

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం అమిగోస్.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే సినిమాలో హీరోయిన్గా నటించిన ఆషికా రంగనాథ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే చాలామందికి ఈ ఆషికా రంగనాథ్ ఎవరు అన్నది తెలియదు.మరి ఆమె గురించి మరిన్ని వివరాల విషయానికి వస్తే.

అమిగోస్ సినిమాతో ఆషికా రంగనాథ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.అయితే ఈ ముద్దుగుమ్మ మొదట 2016లో కన్నడలో విడుదలైన క్రేజీ బాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది.ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మాస్ లీడర్ అనే సినిమాలో నటించి మెప్పించింది.

"""/" / అలాగే దివంగత నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే కన్నడలో తప్పితే ఇతర భాషల్లో ఈమె చాలా తక్కువగా నటించింది.ఆ తర్వాత ఈమె 2022లో అనగా గత ఏడాది పట్టాతు అరసన్ సినిమాతో తమిళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. """/" / అయితే ఈ సినిమాపై ఆషికా రంగనాథ్ చాలా ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా కనుక హిట్ అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయో శక్తి లేదు.

ఇకపోతే అమిగోస్ సినిమా విషయానికి వస్తే ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపత్రాభినయంలో నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మహేష్ రాజమౌళి మూవీ టికెట్ రేటు 5000.. ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనా?