ఈ ఏడాది ఆషాడ మాసం అమావాస్య ఎప్పుడు వచ్చింది.. అమావాస్య పూజ ఎలా చేయాలి?

మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతి నెల ఎన్నో ప్రత్యేకతలతో మన ముందుకు వస్తుంది.

ఈ విధంగానే ఆషాఢ మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.ముఖ్యంగా ఆషాఢమాస అమావాస్య రోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.

ఈ ఆషాఢ అమావాస్యను ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు.

వ్యవసాయం చేసే రైతులకు ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది.ఈ అమావాస్య రోజు రైతులు తమ పంట పొలాలు ఎంతో పచ్చగా ఉండాలని ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ క్రమంలోనే వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఈ అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పూజలు నిర్వహించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఏడాది ఆషాఢ అమావాస్య 2021 జులై 9వ తేదీన వచ్చింది.శుక్రవారం అమావాస్య ఉదయం 5:16 గంటలకు ప్రారంభమై పదవ తేదీ ఉదయం 6:46 ముగిసింది.

ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలను చేయరు.ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున వేకువ జామునే నిద్రలేచి నదీ స్నానం చేయాలి.

అదేవిధంగా సూర్యభగవానుడికి నమస్కరించి నీటిని తర్పణంగా వదలాలి.అదేవిధంగా ఈ అమావాస్య రోజు పూర్వీకుల కోసం ఉపవాసం ఉండి వారినీ తలచుకోవడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.

"""/" / ఆషాఢ అమావాస్య రోజున మన స్తోమతను బట్టి నిరుపేదలకు దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది.

అదే విధంగా ఈ అమావాస్య రోజున ఉదయము రావిచెట్టుకు నీరు అర్పించి సాయంత్రం రావిచెట్టుకు దీపాన్ని వెలిగించి పూజించాలి.

ఈ ఆషాఢమాసం సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కనక ఆరు నెలల కాలాన్ని దక్షిణ యానం అని పిలుస్తారు.

అదేవిధంగా ఈ దక్షిణ యానం లో వచ్చే ఆషాఢమాసంలో తెలంగాణలో అమ్మ వారికి బోనాలను సమర్పించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్నది.

అదేవిధంగా జగన్నాథుని రథ యాత్ర కూడా ఈ ఆషాఢమాసంలోనే జరగడం ఈ ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు.

రామ్, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరికి పాన్ ఇండియాలో డిజస్టర్లను కట్టబెట్టిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా..?