ఆ నిర్మాణానికి చందాలు ఇవ్వడం తప్పని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. !?

హిందువుల కల అయిన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలయ్యాయన్న విషయం తెలిసిందే.

ఇక ఈ రామాలయాన్ని బలమైన భూకంపాలను కూడా తట్టుకుని నిలిచేలా అత్యంత అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించనున్నారు.

కాగా ఈ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుండి నిధుల సేకరణ జరుగుతోంది.

ఇదిలా ఉండగా అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా ముస్లింలు సిద్ధమవుతున్నారట.ఈ నేపధ్యం లో ఇక్కడ నిర్మించే మసీదు విషయంలో హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారట.

అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు చందాలు ఇవ్వడం తప్పని, ఇలా నిర్మించిన మసీదులో నమాజ్‌ చేయవద్దని మతపెద్దలు చెబుతున్నారని వ్యాఖ్యానించారట.

"""/"/ అదీగాక అయోధ్య మసీదు ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మత పెద్దల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను ఈ విషయాలు మాట్లాడుతున్నానని ఒవైసీ తెలిపారు.

ఇకపోతే అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!