మిత్రపక్షంతో బిఆర్‌ఎస్ కు ముప్పే..?
TeluguStop.com
ఈసారి తెలంగాణ ఎన్నికలు( Telangana Elections ) రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
ఎందుకంటే అన్నీ ప్రధాన పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా పోటీకి దిగేందుకు సిద్దపడుతుండడం, అలాగే గెలుపు విషయంలో కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తుండడంతో గెలుపుపై అంచనా వేయడం విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు.
సాధారణంగా ఎన్నికలవేళ బలాన్ని పెంచుకునేందుకు రాజకీయ పార్టీలు తాపత్రయ పడుతూ ఉంటాయి.అందుకోసం ఇతర పార్టీలతో కలిసి పొత్తు పొట్టుకొని ఎన్నికల సమరానికి వెళుతుంటాయి.
పొత్తు పెట్టుకోవడం వల్ల బలహీనంగా ఉన్న నియోజిక వర్గాలలో సైతం బలం సాధించవచ్చనే ఎత్తుగడతో పొత్తుల వైపు మొగ్గు చూపుతుంటాయి.
కానీ ఈసారి తెలంగాణ పొత్తు ప్రస్తావనకు ఆమడ దూరంలో నిలుస్తున్నాయి ప్రధాన పార్టీలు.
"""/" / వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ, కాంగ్రెస్ వంటి ఇప్పటికే ప్రకటించాయి.
ఇక అధికార బిఆర్‌ఎస్ కు గత ఎన్నికల టైమ్ నుంచి ఏంఐఏం మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది.
7 నుంచి 10 స్థానాల్లో సత్తా చాటగలిగే మజ్లిస్ పార్టీతో పొత్తు బిఆర్‌ఎస్( BRS Party ) కు మంచిగానే ఉపయోగపడుతూ వచ్చింది.
కానీ ఈసారి ఈ రెండు పార్టీలు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నాయి.ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తమకు బలమున్న అన్నీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడతామని చెప్పుకొచ్చారు.
"""/" / దీంతో ఏంఐఏం పార్టీ( AIMIM Party ) బిఆర్‌ఎస్ తో విభేదిస్తోందా అనే డౌట్ వ్యక్తమౌతోంది.
ఇక బిఆర్‌ఎస్ ఆగ్రనేతలు కేసిఆర్, కేటిఆర్( CM KCR ) కూడా ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, స్పష్టం చేశారు.
దీంతో మజ్లిస్ తో పొత్తు లేనట్లే అనే విషయం స్పష్టమౌతోంది.అయితే మజ్లిస్ తో పొత్తు లేకపోతే బిఆర్‌ఎస్ కు నష్టమే అంటున్నారు కొందరు విశ్లేషకులు.
గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని ఏడు స్థానాలను ఏంఐఏం కైవసం చేసుకుంది.
ఈసారి 10 నుంచి 15 స్థానాల్లో విజయం పక్కా అని ఏంఐఏం వర్గం నుంచి వినిపిస్తున్న మాట.
ఈసారి బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలతో గట్టి పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో మజ్లిస్ దూరమైతే బిఆర్‌ఎస్ కు ముప్పే అని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఎవరికి వారే అన్నట్లుగా జరుగుతున్నా తెలంగాణ పాలిటిక్స్ లో సత్తా చాటే పార్టీ ఏదో చూడాలి.
వసుంధర మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్లు.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!