ఆర్జేడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మండిపాటు

నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

శవపేటిక అని ఎందుకు అంటున్నారన్న ఆయన ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చని తెలిపారు.ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ లేదని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.

కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేవలం వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రధాని మోదీ ప్రారంభించారని విమర్శలు చేశారు.