సర్వర్ పని చేయకపోవడంతో అమెరికాలోని ఎయిర్ పోర్ట్ లో.. ఒక్క విమానం కూడా..

టెక్నికల్ సమస్య అగ్రరాజ్యాన్ని వణిగించేసింది అని చెప్పాలి.గంటల తరబడి విమానాలను ఎగరకుండా ఆపేసింది.

ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతుంది.సిస్టమ్స్ ను ఎవరైనా హ్యాక్ చేశారా అలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో విమానాలు గ్రౌండ్ లోనే నిలబడిపోయాయి.ఇందులో ఆశ్చర్యమేముంది ఆకాశం నుంచి కిందికి వచ్చిన ప్రతి ఫ్లైట్ గ్రౌండ్ లోకి రావాల్సిందే అనుకుంటున్నారా.

దిగిన అన్ని ఫ్లైట్లో కూడా గాల్లోకి ఎగరలేదు.దీనికి కారణం కూడా ఉంది.

కంప్యూటర్లు డౌన్ అయిపోయాయి.సిస్టం సర్వర్లు ఫెయిల్ అయ్యాయి.

దీనివల్ల వేలాది ఫ్లైట్లో ఆగిపోవడం జరిగింది.సిస్టం టూ ఎయిర్ మిషన్ ఆగిపోవడంతో ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడినుంచి బయలుదేరాలో అనేది తెలియకుండా పోయింది.

దీనివల్ల దాదాపు 5400 విమానాలు ఆగిపోతే అందులో 550 విమానాలు పూర్తిగా రద్దు అయిపోయాయి.

దీనివల్ల రంగంలోకి దిగిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితిని చక్కదిద్దే పని మొదలుపెట్టింది.

"""/"/ అమెరికాలో ఏర్పోర్ట్ లో కొన్ని గంటల పాటు ఈ గందరగోళం ఏర్పడింది.

వేలాది మంది ప్రయాణికులు ఏర్పోర్ట్ లోనే చిక్కుకొపోయారు.తమ ఫ్లైట్ ఎక్కడుందో ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని పరిస్థితి రావడంతో అంతా గందరగోళంగా ఉన్నారు.

ట్విటర్లో ఫెడరల్ ఏవియేషన్ ని దారుణంగా ప్రయాణికులు విమర్శించారు.పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందంటూ మండిపడ్డారు.

ఎఫ్ ఏ ఏ తీవ్రంగా కృషిచేసి సిస్టమ్స్ ను రీస్టార్ట్ చేసింది.అయితే ఒకసారి కాకుండా విమానాలను ఒక్కొక్కటిగా అనుమతులు ఇస్తూ వచ్చారు.

"""/"/ దాదాపుగా 12 గంటల పాటు అమెరికాలోని ఎయిర్పోర్ట్లలో ఈ గందరగోళం ఏర్పడింది.

కేవలం సిస్టమ్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఇలా జరిగిందని కూడా వివరణ ఇచ్చింది.

అగ్రరాజ్యంగా పేరు ఉన్న అమెరికాలో ఇలాంటి సమస్య రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

దీనిపై ఇంకా లోతైన విచారణ చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.

అమెరికాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పటికే చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!