కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్ సిరితో షణ్ముఖ్ చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పేశారు.
ఇలా వీరిద్దరి విడిపోవడానికి కారణం సిరి అంటూ ఆమె గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగాయి.
ఇక దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ ఎవరి దారి వారు చూసుకుని మరి కెరియర్ లో బిజీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే స్టార్ మా బిగ్ బాస్ జోడి అనే కార్యక్రమం ద్వారా మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురానుంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీ ప్రసారం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా షణ్ముఖ్ జశ్వంత్ మై లవ్ ఈజ్ గాన్ అనే పాటకు ఫర్ఫార్మెన్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ రవి దీపికా పిల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ రవి మరోసారి షణ్ముఖ్ జస్వంత్ ను అడ్డంగా ఇరికించారు.
షణ్ముఖ్ జస్వంత్ ఫర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత యాంకర్ రవి షణ్ముఖ్ తో మాట్లాడుతూ.
మీకు ప్రేమ పై నమ్మకం ఉందా? అంటూ ప్రశ్నించారు.ఇలా రవి అడగడంతో షణ్ముఖ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అదే విధంగా మీకు ప్రేమలో థాంక్స్, సారీ, బాయ్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతావు అంటూ ప్రశ్నించారు.
ఇలా రవి అడగడంతో షణ్ముఖ్ సందిగ్ధంలో పడిపోయారు.మరి రవి అడిగిన ప్రశ్నకు షణ్ముఖ్ జస్వంత్ ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు అనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి 13వ తేదీ వరకు వేచి చూడాలి.
"""/"/
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా విడిపోయిన షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా ఇప్పటివరకు కలవలేదు.
కానీ బిగ్ బాస్ జోడి కార్యక్రమం ద్వారా వీరిద్దరూ ఒకే వేదిక పైకి రానున్నారు.
మరి ఈ కార్యక్రమంలో నైనా వీరిద్దరూ మాట్లాడతారా.లేదా అనే విషయం గురించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం తన పరిస్థితికి అనుగుణంగా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.