Minister Peddireddy : ఊహించినట్లే అన్ని పార్టీలు ఏకం అయ్యాయి..: మంత్రి పెద్దిరెడ్డి
TeluguStop.com
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
అందరూ ఊహించినట్లే అన్ని పార్టీలు ఏకం అయ్యాయన్నారు.సీఎం జగన్( CM Jagan ) ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధే తమకు శ్రీరామరక్ష అని తెలిపారు.
మంచి చేసి ఉంటేనే ఓటు వేయాలని చెప్పే ధైర్యం ఒక్క జగన్ కు మాత్రమే ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తరహాలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదని పేర్కొన్నారు.
"""/" /
ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మరోసారి ఓటు వేయాలని అడుగుతున్నామని స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని కుప్పంలోనూ అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు.ఈ క్రమంలోనే ఈ సారి కుప్పంలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జాతిరత్నాలు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్.. మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!