వ్యకాస పోరాట ఫలితంగానే ఉపాధి కూలీలకు దినసరి వేతనం పెంపు: మట్టిపల్లి

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ రూ.

300 కు పెంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం( Telangana Agricultural Workers Union ) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు(Saidulu Mattipally ) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సుప్రీంకోర్టు( Supreme Court ) తీర్పు ప్రకారం ప్రతి కార్మికునికి నెలకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిందన్నారు.

సుప్రీంకోర్టు సూచన ప్రకారం ప్రతి కార్మికుడికి రోజు కూలీ రూ.600 ఇవ్వాలని గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజు కూలీ రూ.

300 కు పెంచిందన్నారు.గతంలో కూలీలకు ఇచ్చిన సమ్మర్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని దాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించి కూలీలను ఆదుకోవాలని కోరారు.పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మెడికల్ కిట్టు,టెంటు,పార, గడ్డపార వంటి పనిముట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా…అప్పుడు అలా… ఇప్పుడు ఇలా?