నోరా ఫతేహీతో ప్రేమాయణం నడుపుతున్న బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు.. ఫొటోస్ వైరల్?
TeluguStop.com
సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీకి సంబంధించిన రిలేషన్ షిప్, డేటింగ్, ఎఫైర్ లకు గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
ఇకపోతే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డేటింగ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.కాగా టాలీవుడ్ లో ప్రస్తుతం తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతోంది అంటూ న్యూ ఇయర్ నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యాన్ ఖాన్ ఒక నటితో డేటింగ్ లో ఉన్నాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆ నటితో కలిసి చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగానే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహానటి మరెవరో కాదు పాపులర్ ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి.
ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహి తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా నోరా ఫతేహి వయసు 30 ఏళ్ళు.
వీరిద్దరూ ఇటీవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయిలో జరుపుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
"""/"/
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నోరా ఒక డిన్నర్ పార్టీలో కనిపించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వడలు అవుతున్న ఆ ఫోటోలను బట్టి చూస్తే ఆర్యన్ ఖాన్,నోరా ఫతేహి నిజంగానే డేటింగ్ లో ఉన్నారు అంటూ బాలీవుడ్ సిని వర్గాలలో వార్తలు కోడై కూస్తున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన పలువురు నెటిజన్స్ కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!