Delhi CM Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి కస్టడీ విధించిన కోర్టు..!!

లిక్కర్ స్కాం కేసు దేశాన్ని కుదిపేస్తోంది.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి( Aam Aadmi Party ) చెందిన నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు.

కేజ్రీవాల్ సతీమణి సునీత తొలిసారి స్పందించారు.తన భర్త ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు.

ఆయన అరెస్టు అక్రమం అని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది.

ఆయనకు ఈనెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పు ఇచ్చింది.

"""/" / దీంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.ఈడీ నిన్న కేజ్రీవాల్ నీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) ఈడీ కస్టడీలో ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉండగా కేజ్రీవాల్ కి కోర్టు కస్టడీ విధించడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత( Sunitha ) లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ( Atishi ) ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది.తమ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 26న ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది.

అలాగే హోలీ పండుగ ఎవరు జరుపుకోవద్దని పేర్కొంది.శనివారం ఢిల్లీలో షాహిదీ పార్కులో దేశాన్ని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఇదేందయ్యా ఇది.. రన్నింగ్ ఆటోలోనే దాన్ని రిపేర్ చేసేస్తున్నాడుగా