పంజాబ్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్..!!
TeluguStop.com
త్వరలో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతుంది.
మోడీ ప్రభుత్వాన్ని కుదిపేసిన రైతు ఉద్యమం మొదటి నుండే స్టార్ట్ అవ్వటం అదే రీతిలో రైతు ఉద్యమం లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా వ్యవహరించడంతో .
పంజాబీ ఎన్నికలలో దూకుడుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక వ్యూహాలు వేస్తూ ఉంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇటీవల చండీగఢ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.
పర్యటన చేపట్టి అధికారంలోకి వస్తే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా అందిస్తామని ప్రకటించడం తెలిసిందే.
అయితే తాజాగా 200 యూనిట్లు కాదు 300 యూనిట్ల వరకు.కరెంటు ఫ్రీ అంటూ పంజాబ్ ఓటర్లకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది.
అంతమాత్రమే కాకుండా ఈ పథకం అమలుతో దాదాపు 77 శాతం నుండి 80% వరకు విద్యుత్తు భారం ప్రజలపై ఉండదని తెలిపారు.
"""/"/ కల్లబొల్లి మాటలు చెప్పడం కాదని అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అన్నిటిని నెరవేరుస్తామని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని చెప్పుడు మాటలు అంటూ కేజ్రీవాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ కు ఈజీగా చెక్ పెట్టండిలా!