వివాదాస్పద యూట్యూబ్ స్టార్ సంచలన నిర్ణయం

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది తమ టాలెంట్ చూపించుకోవడానికి దానిని ఒక వేదికగా మార్చుకున్నారు.

తమ భావాలు, భావోద్వేగాల్ని ప్రపంచంలో అందరికి పరిచయం చేయడానికి యుట్యూబ్ వంటి వీడియో చానల్స్ ఉయోగించుకున్నారు.

ఇలా పేస్ బుక్, యుట్యూబ్ వంటి సోషల్ మీడియాల ద్వారా కొంత మంది తమ టాలెంట్ తో, కొంత మంది తమ వ్యక్తిత్వంతో, మరికొంత మంది తమ మాటలతో రాత్రికి రాత్రి సెలబ్రిటీలు మారిపోయారు.

అలాంటి వారి వీడియోలకి లక్షల్లో ఫలోవర్స్ ఉంటారు.అలాంటి కోవలోకి చెందిన వాడే యుట్యూబ్ స్టార్ ప్యూడిపి.

యూట్యూబ్‌లో ప్యూడీపీగా పేరొందిన ఫెలిక్స్‌ అర్విడ్‌ జెల్‌బెర్గ్‌ అనే స్వీడన్‌ దేశస్థుడు వివాదాస్పద అంశాలని తీసుకొని వాటిని సెటైరికల్ గా వీడియోలు చేస్తూ యుట్యూబ్లో పెట్టి భాగా గుర్తింపు పొందాడు.

యూట్యూబ్‌లో అతడికి ఏకంగా 102 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.ప్యూడీపీ యూట్యూబ్‌లో పెట్టే వీడియోల ద్వారా నెలకు లక్షల పౌండ్ల ఆదాయం అర్జిస్తున్నాడు.

సోషల్ మీడియాలోనూ ఇతనికి ఫాలోవర్లు విపరీతంగా ఉన్నారు.ట్విట్టర్‌లో 18 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఇతనిని చేర్చింది.

ఇంత పాపులారిటీని అతి తక్కువ టైంలో సొంతం చేసుకున్న ఇతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.బాగా అలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ కారణంగా యూట్యూబ్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు తెలిపాడు.2020 ఆరంభంలోనే యూట్యూబ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

స్లిమ్ లుక్ లో ఆహా అనిపిస్తున్న ప్రభాస్.. ఆ సినిమాల కోసమే 10 కేజీల బరువు తగ్గారా?