Ranbir Kapoor : శ్రీరాముని పాత్రలో యానిమల్ నటుడు రణ్ బీర్ కపూర్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

రామానంద్ సాగర్ ఐకానిక్ దూరదర్శన్ సీరియల్ రామాయణం( Ramayanam Serial )లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ప్రేక్ష‌కులు ఆయనను అమితంగా ఇష్టపడుతు ఉంటారు.తన పాత్రకు గోవిల్( Arun Govil ) ఇప్పటికీ గౌరవ మ‌ర్యాద‌లు అందుకుంటున్నారు.

అతడు ఇటీవ‌ల విడుద‌లైన ఆదిపురుష్ పైనా త‌న‌దైన శైలిలో స్పందించారు.ఇప్పుడు నితీష్ తివారీ- రామాయణం ట్ర‌యాల‌జీలో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హిందూ దేవుడు శ్రీ‌రాముడి పాత్రలో న‌టించ‌డం స‌రైన‌దేనా? అన్న దాని గురించి ఓపెన్ గా చ‌ర్చించారు.

"""/"/ కాగా రామాయణంలో రణబీర్ లార్డ్ రామ్ పాత్ర( Lord Srirama Role )ను పోషించడం గురించి తాను ఏమనుకుంటున్నాడో గోవిల్ వెల్లడించాడు.

ఐకానిక్ దూరదర్శన్ సీరియ‌ల్‌ లోని శ్రీ‌రాముడి పాత్రధారిని ర‌ణ‌బీర్ సమం చేయగలరా అని ప్ర‌శ్నించ‌గా, అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.

అది జరుగుతుందో లేదో కాలమే చెప్పగలదు.దాని గురించి ముందుగా ఏమీ చెప్పలేము అని తెలిపారు.

అయితే రణబీర్ న‌ట‌ప్ర‌తిభ వ్య‌క్తిగ‌త క్యారెక్ట‌ర్ ని త‌న‌దైన శైలిలో ఆకాశానికెత్తేశారు.ర‌ణ‌బీర్ విషయానికి వస్తే అతడు మంచి నటుడు.

అవార్డు గెలుచుకున్న మేటి నటుడు. """/"/ అతడి గురించి నాకు తెలిసినది చాలా కష్టపడి పనిచేస్తాడు.

అతడు చాలా సంస్కారవంతమైన పిల్లవాడు.మంచి నైతిక సాంస్కృతిక విలువలను కలిగి ఉన్న‌వాడు.

నేను చాలాసార్లు గమనించాను.అతడు తన స్థాయిని ఉత్తమంగా పెంచుకోవ‌డానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు.

యానిమ‌ల్( Animal ) లో హింసాత్మ‌క‌మైన పాత్ర‌లో న‌టించిన ర‌ణ‌బీర్ పై అరుణ్ గోవిల్ వ్య‌తిరేక‌త‌ను క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డం ఆస‌క్తికరం అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ని బీట్ చేస్తుందా..?