జిల్లాలో కొనసాగిన అరెస్టుల పర్వం…!

నల్లగొండ జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ యాడికి పోయినా సరే అక్కడ అక్రమ అరెస్టులు సర్వసాధారణంగా మారిందని కాంగ్రెస్,బీజేపీ నేతలు మండిపడ్డారు.

అదే పరిస్థితి సోమవారం నల్గొండ జిల్లాలో కూడా పునరావృతమైందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్య కాదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వ తీరును తప్పబట్టారు.

దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలనకి వెళ్తున్న సీఎం కెసిఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారని సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజాము నుండే జిల్లాలో ముఖ్య కాంగ్రేస్ నాయకులను,నకిరేకల్ యువజన మండల అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనుతో పాటు పలువురి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి,పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఇదిలా ఉంటే మరోవైపు నకిరేకల్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ జిల్లా బైంసాలో తలపెట్టిన పాదయాత్రకు వెళ్తున్న నకిరేకల్ బీజేపీ నాయకులను,కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారు.

తమను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్,బీజేపీ నేతలు స్ధానిక పోలీస్ స్టేషన్లలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీను మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర బైంసా నుండి ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి భయం వేస్తుందని, అందుకే ఈ అక్రమ అరెస్టులు చేశారన్నారు.

గత ప్రభుత్వాల వైఖరి ఇలానే ఉంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం వస్తే అక్రమ అరెస్టులు,ధర్నా చౌక్ లు ఉండవన్న కెసిఆర్ ఇప్పుడు ఎలా అక్రమ అరెస్టు చేపిస్తున్నారని మండిపడ్డారు.

కూటమి కొంప ముంచబోతున్న ‘ గాజు గ్లాస్ ‘